calender_icon.png 1 October, 2025 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల్లో ‘స్థానిక’ హడావుడి

01-10-2025 12:35:35 AM

  1. ముఖ్య నాయకుల వద్దకు చక్కర్లు కొడుతున్న ఆశావహులు

బిఆర్‌ఎస్‌లో ధీమా... కాంగ్రెస్లో పరేషాన్ 

కార్యకర్తలను సమాయత్తం చేసుకుంటున్న బీజేపీ

గజ్వేల్, సెప్టెంబర్ 30: గ్రామాల్లో స్థానిక చలనం మొదలైంది. స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు ప్రకటించడంతో పాటు త్వరలో నోటిఫి కేషన్ వెలువనుండడంతో ఆయా పార్టీల నా యకులు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. బిఆర్‌ఎస్ కంచుకోటగా మారిన గజ్వేల్ నియోజకవర్గం లో ఆ పార్టీ నాయకులు రిజర్వేషన్లు మార్పు జరిగిన కూడా అ న్ని మండలాల గ్రామాలలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

ఇప్పటికే నియోజకవర్గ ముఖ్య నాయకులతో తమకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేయాలంటూ ప్రతిపాదనలు పెడుతున్నారు. ఆశా వహులు సైతం తమను బలపరుస్తున్న నా యకులను తీసుకువెళ్లి తమకే పార్టీ నుంచి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఎన్నికలలో పోటీ చేయడానికి ఇప్పటికే అం తర్గతంగా అన్ని సిద్ధం చేసుకుంటున్నారు.

అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో సై తం ఎంపీటీసీ , జడ్పిటిసి, సర్పంచ్ స్థానాలకు ఆశావహులు ఉన్నా కూడా ప్రతిపక్ష పా ర్టీకి అభ్యర్థులకు దీటుగా ఉండడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఉచిత బస్సు, ఉచిత కరెంటు, రుణమాఫీ ఎంతో ప్రభావం చూపి ప్రజల్లో దాదాపుగా మంచి నమ్మకాన్ని పొందే సమయంలో యూరియా కష్టాలు మరోసారి కాంగ్రెస్ స్థాయిని ప్రజల్లో తగ్గించాయి.

ఈ విషయంలో నాయకులు సైతం ఆందోళన చెందినప్పటికీ ప్రస్తుతం సమస్య పరిష్కార దిశగా కొనసాగుతుండడంతో గెలుస్తామన్న ఆశలు పెరిగాయి. కానీ అంతర్గతంగా కాంగ్రెస్ నాయకులు ఆందోళన చెం దుతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు బతుకమ్మ చీరల పంపిణీ కూడా జరగకపోవడం తో ప్రజలు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా మార్కులు ఇస్తారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.

ఇక బిజెపి పార్టీలో మెదక్ ఎంపీ స్థానం గెలుపుతో నూతన ఉత్తేజాన్ని కార్యకర్తలు పొందారు. నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎదురుచూసినా రిజర్వేషన్లు మారడం వారిలో కలవరాన్ని రేపింది. అనుకున్న స్థానాలన్నీ తారుమారు కావడంతో బిజెపి నాయకుల ఆశలు అడియాసలు అయ్యాయి.

అయినా కార్యకర్తల్లో స్థానిక సంస్థల్లో గెలుపు కోసం నిరంతరం కృషి చేయాలంటూ బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇతర నాయకులు ఎప్పటికప్పుడు కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ కార్యకర్తల్లో మనోధైర్యాన్ని కల్పిస్తున్నారు. ఆయా గ్రామాల్లో పోటీ చేయడానికి బలమైన నాయకులను సిద్ధం చేసుకుంటున్నా రు. 

మూడు పార్టీలకు గజ్వేల్ ని యోజకవర్గంలో తమ బలాన్ని చూపించుకునేందుకు స్థానిక సంస్థల ఎన్నికలు ఒక అవ కాశం కాగా, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, అధిక స్థానాలను చేజిక్కించుకొని తమ సత్తా చాటాలని ఎదురుచూస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లో ఎన్నికల సందడి సందడి మొదలు కానుంది.