calender_icon.png 1 October, 2025 | 5:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెదక్ జడ్పీ పీఠంపై కన్నేసిన ప్రధాన పార్టీలు!

01-10-2025 12:39:04 AM

  1. చైర్మన్ స్థానానికి పెరుగుతున్న ఆశావహులు

కాంగ్రెస్ నుంచి మదన్రెడ్డి, ఎలక్షన్రెడ్డి, మహిపాల్రెడ్డి

బీఆర్‌ఎస్ నుంచి పద్మారెడ్డి, తిరుపతిరెడ్డి పోటాపోటీ

మెదక్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. మెదక్ జిల్లాలో ఈసారి స్థానిక సం స్థల ఎన్నికలు రసవత్తరంగా కొనసాగనున్నాయి. మెదక్ జడ్పీ చైర్మన్ స్థానం ఓసీ జ నరల్ కావడంతో అందరి చూపు చైర్మన్ పీఠంపై పడింది. ఎలాగైనా చైర్మన్గా పోటీ చే యాలని ప్రధాన పార్టీల ఆశావహులు ఉవ్విళ్ళూరుతున్నారు.

అధికార కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు పోటీ పడుతుండగా, బీఆర్‌ఎస్ నుండి ప్రధానంగా ఇద్దరు పోటీ పడు తున్నారు. ఈ సంఖ్య రానున్న రోజుల్లో పెరిగే అవకాశం లేకపోలేదు. అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోటీ బాగానే పెరు గుతుంది. అలాగే బీఆర్‌ఎస్ తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందడానికి స్థానిక సంస్థల్లో సత్తా చాటడానికి కసరత్తు ప్రారంభించింది. 

కాంగ్రెస్లో పెరుగుతున్న ఆశావహులు..

మెదక్ జిల్లా పరిషత్ చైర్మన్ స్థానం ఓసి జనరల్ కావడంతో ప్రధాన పార్టీల నుండి పోటీ బాగా పెరిగింది. అధికార పార్టీ కాం గ్రెస్ నుండి నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డితో పాటు మనోహరాబాద్ మండలానికి చెందిన మహిపాల్రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గం మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నుండి ఎలక్షన్రెడ్డి తీవ్రస్థాయిలో పోటీ పడనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుందో మల్లగుల్లాలు పడుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ నుం చి మదన్రెడ్డికి ఖరారవుతుందని ప్రచారం సాగుతోంది. నర్సాపూర్ నియోజకవర్గం నుండి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఈయన గత లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ మదన్రెడ్డికి ఎలాంటి పదవులు ఇవ్వలేదు. దీంతో రానున్న జడ్పీ ఎన్నికల్లో చైర్మన్గా పోటీ చేస్తారని ప్రచారం సాగింది.

అలాగే తూప్రాన్ మండలానికి చెందిన సీనియర్ నేత ఎలక్షన్రెడ్డి సైతం రంగంలోకి ఉం డనున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ ఆదేశిస్తే పో టీ చేయనున్నట్లు ఆయన వర్గీయులు తెలుపుతున్నారు. మరోవైపు మనోహరాబాద్ మండలానికి చెందిన మహిపాల్రెడ్డి సైతం జడ్పీ చైర్మన్ రేసులో ఉండనున్నట్లు ప్రచా రం సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర కాం గ్రెస్ నాయకులు మైనంపల్లి హన్మంతరావు అండదండలు పుష్కలంగా ఉన్న మహిపాల్రెడ్డికి ఖరారు చేసేందుకు విశ్వప్రయత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. 

బీఆర్‌ఎస్లోనూ పోటీ ఎక్కువే..

బీఆర్‌ఎస్ పార్టీలోనే జడ్పీ చైర్మన్ గా నిలబడేందుకు ఆశావహుల సంఖ్య పెరుగుతోం ది. చైర్మన్ రేసులో మెదక్ మాజీ ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి లేదా ఆమె భర్త దేవేందర్రెడ్డి, మరో ముఖ్యనేత కంఠారెడ్డి తిరుపతిరెడ్డి టికెట్టును ఆశి స్తున్న వారిలో ఉన్నారు. మెదక్ నియోజకవర్గంలో పద్మాదేవేందర్రెడ్డికి మింగుడుపడని విధంగా కంఠారెడ్డి తయరైన విషయం తెలిసిందే.

ప్రధానంగా వీరిద్దరి మధ్యనే పోటీ ఉండే అవకాశం ఉంది. అయితే అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్రావు ఆశీస్సులు ఎ వరిపై ఉంటాయో వారికే అవకాశం లభించే లా ఉంది. వీరే కాకుండా కేసీఆర్కు సన్నిహితుడుగా పేరున్న మాజీ ఎమ్మెల్సీ శేరి సు భా ష్రెడ్డి పేరు సైతం వినిపిస్తోంది. ఏదిఏమైనా మెదక్ జడ్పీ చైర్మన్ రేసులో రెండు ప్రధాన పార్టీల్లో ఆశావహుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరోవైపు బీజేపీ పార్టీలో అభ్యర్థి ఎవరనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు.