19-05-2025 10:29:24 PM
మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల(Singareni High School)లో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించనున్న స్వర్ణోత్సవ వేడుకల లోగోను బుధవారం పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో సింగరేణి అధికారులు ఆవిష్కరించనున్నారని పాఠశాల కరస్పాండెంట్, ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జే పురుషోత్తంలు తెలిపారు. బుధవారం నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి జి శ్రీనివాస్ రావు, స్థానిక ఏరియా జిఎం జి దేవేందర్ లు హాజరై, లోగోను విడుదల చేయడంతో పాటు స్వర్ణోత్సవాలకు సంబంధించిన కార్యక్రమం వివరాలు, తేదీని సైతం వెల్లడించడం జరుగుతుందని తెలిపారు. స్వర్ణోత్సవ వేడుకలకు పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, ప్రస్తుత, పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని, విజయవంతం చేయాలన్నారు.