calender_icon.png 29 May, 2025 | 12:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసు వాహనాలను ఢీకొన్న లారీ

26-05-2025 01:04:19 AM

  1. హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం  

మరో ఇద్దరు పోలీసు సిబ్బందికి తీవ్ర గాయాలు 

శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద షాపూర్ వద్ద ఘటన 

రెండు నెలల క్రితమే ప్రమోషన్.. అంతలోనే మృతి ఒడికి    చేరుకున్న విజయ్ కుమార్

ప్రమాదానికి గురైన లారీని  తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేస్తుండగా ఘటన 

రాజేంద్రనగర్, మే 25: రోడ్డుపై ప్రమాదానికి గురైన లారీని తొలగించి ట్రాఫిక్ క్లి యర్ చేస్తుండగా అతివేగంగా వచ్చిన మరో లారీ రెండు పోలీసు వాహనాలను ఢీకొనడంతో ఓ హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం చెం దగా మరో ఇద్దరు పోలీసు సిబ్బందికి తీవ్ర గాయాలైన సంఘటన రంగారెడ్డి జిల్లా శం షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

రెండు రెండు నెలల క్రితమే హెడ్ కా నిస్టేబుల్ గా ప్రమోషన్ పొందిన వ్యక్తి అంతలోనే మృత్యు ఒడికి చేరుకోవడం తీవ్ర విషా దాన్ని నింపింది. ఈ ఘటనకు సంబంధించి శంషాబాద్ ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి 9:48 గంటలకు శంషాబాద్ మండలంలోని పెద్ద షాపూర్ గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఓ లారీ ప్రమాదానికి గురైందని డయల్ 100కు కాల్ వచ్చింది.

దానిని తొలగించేందుకు పెట్రోల్ మొబైల్-1 సిబ్బంది హెడ్ కాని స్టేబుల్ దాదే విజయ్ కుమార్, కానిస్టేబుల్ చెన్నయ్య, హైవే ట్రాఫిక్  మొబైల్-2 పోలీసు లు యాదయ్య, డ్రైవర్ శ్రీనివాస్ అక్కడికి చేరుకున్నారు.  ప్రమాదానికి గురైన లారీని తొలగించి వాహనాలను క్లియర్ చేస్తుండగా రాత్రి 10:45 గంటలకు కర్ణాటక రాష్ట్రానికి చెందిన (కేఏ 56 6430) లారీ అతివేగంగా వచ్చి పెట్రో మొబైల్ -2 (టీ ఎస్ 09 పి ఏ 6597), అదేవిధంగా మొబైల్ -1 వాహనం (టీ ఎస్ 09 పి ఏ 3610)ను ఒక్కసారి గా ఢీ కొంది.

ఈ ప్రమాదంలో శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ దాదే విజయ్ కుమార్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ట్రాఫిక్ మొబైల్-2 కానిస్టేబుల్ యాదయ్య, డ్రైవర్ శ్రీనివాస్ తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి తెలిపా రు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ర మేష్ కంబల్లేను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

రెండు నెలల క్రితమే ప్రమోషన్..

మృతి చెందిన దాదే విజయ్ కుమార్ స్వగ్రామం షాబాద్ మండలం కురువగూడ. ఆయనకు భార్య స్వాతి, ఓ కుమారుడు కు మార్తె ఉన్నారు. విజయ్ కుమార్ కు రెండు నెలల క్రితమే హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ వచ్చింది. అంతలోనే ప్రమాదానికి గురై మృతి చెందడంతో కుటుంబీకులు, స్నేహితులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.

హెడ్ కానిస్టేబుల్‌కు తుది వీడ్కోలు

  1. ప్రభుత్వ లాంఛనాలతో  విజయ్ కుమార్ అంత్యక్రియలు
  2. హాజరైన శంషాబాద్ డీసీపీ రాజేశ్,  ఏసీపీ శ్రీకాంత్ గౌడ్

చేవెళ్ల, మే 25: శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం లో చనిపోయిన హెడ్ కానిస్టేబుల్ దాదే వి జయ్ కుమార్‌కు కుటుంబ సభ్యులు, పోలీసులు, గ్రామస్తులు తుది వీడ్కోలు పలికా రు.  ఆదివారం అతని స్వగ్రామమైన షాబా ద్ మండలం కుర్వగూడ గ్రామంలో ప్రభు త్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపా రు. మృతదేహాన్ని శనివారం రాత్రే స్వగ్రామానికి చేర్చిన పోలీసులు ఆదివారం కు టుంబ సభ్యులు, బంధువుల ఆధ్వర్యంలో ఇంటి నుంచి సమాధి వరకు అంతిమ యా త్ర నిర్వహించారు. 

అనంతరం  శంషాబా ద్‌జోన్‌డీసీపీ రాజేశ్, డివిజన్ ఏసీపీ శ్రీ కాంత్ గౌడ్ , శంషాబాద్ పోలీస్ స్టేషన్ ఇ న్ స్పెక్టర్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సి బ్బంది గాల్లోకి మూడు రౌంట్లు కాల్పులు జరిపి సెల్యూట్ చేశారు.  కాగా,   రెండు రెండు నెలల క్రితమే హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ పొందిన విజయ్ కుమార్.. అం తలోనే   ప్రమాదానికి గురై మృతి చెందడంతో కుటుంబీకులు, స్నేహితులు, బంధు వులు కన్నీరుమున్నీరుగావిలపించారు.