16-06-2025 12:00:00 AM
కొండపాక,జూన్15: సిద్దిపేట వైపు వెళ్తూ కొమురవెల్లి కమాన్ వద్ద రాజీవ్ రహదారిపై ఆగిన బస్సును లారీ ఢీ కొట్టిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మంచిర్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి సిద్దిపేట వైపు వెళ్తూ ప్రయాణికులను దింపేందుకు కొమురవెల్లి కమాన్ వద్ద ఆగింది. అదే వైపు నుంచి అజాగ్రత్తగా అతివేగంగా వస్తున్న లారీ బస్సు వెనుక వైపు ఢీ కొట్టింది. లారీ ముందువైపు భాగము పూర్తిగా దెబ్బతింది. క్లీనర్ అందులోనే ఇరుక్కుపోయాడు.
బస్సులోని ప్రయాణికులు దిగడం కోసం బస్సులో ముందు వైపుకు రావడంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం వాటిల్ల లేదు. ఈ సంఘటనతో రోడ్డుపై వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్థానికుల సహా యంతో పోలీసులు, టోల్ ప్లాజా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహా యంతో వాహనాన్ని పక్కకు జరప డంతో ట్రాఫిక్ క్లియర్ అయింది. సుమారు అర గంటసేపు వాహనాలు నిలిచిపోయా యి. లారీ క్లీనర్‌కు గాయాలు కావడంతో ఆసు పత్రికి తరలించారు . బస్సు డ్రైవరు ఫిర్యాదు మేరకు కుకునూరుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.