28-06-2025 12:55:14 AM
రంగారెడ్డి, జూన్ 27( విజయక్రాంతి) : రంగారెడ్డి జిల్లా పశువైద్యాధికారిగా మధుసూదన్ రెడ్డి శుక్రవారం తన కార్యాలయం ఆవరణలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పశు వైద్య సేవలను మరింతగా విస్తృతం చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా సేవలందించేలా చర్యలు తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు.
వ్యవసాయ అను బంధంగా రైతులను పశు పోషణ పై మరింత అవగాహన కల్పిస్తూ తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాలను అర్హులైన రైతులకు అందేలా చర్యలు తీసుకుంటానని ఆయన హామీని ఇచ్చారు. జిల్లా పశువైద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన మధుసూదన్ రెడ్డిని జిల్లాలో వివిధ మండలాల్లో విధులు నిర్వహిస్తున్న పశు వైద్యాధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.