calender_icon.png 2 January, 2026 | 11:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంను కలిసిన చిలుక మధుసూదన్‌రెడ్డి

02-01-2026 12:51:13 AM

అబ్దుల్లాపూర్‌మెట్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి గురువారం ఉదయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో  మర్యాదపూర్వకంగా కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు, దనసరి అనసూయ (సీతక్క), కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అలాగే ఇబ్రహీంపట్నం  ఎమ్మెల్యే  మల్ రెడ్డి రంగారెడ్డిలను కూడా మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.