02-01-2026 12:51:10 AM
అయిజ, జనవరి 1: గద్వాల జిల్లా అయిజ మునిసిపాలిటీ కార్యాలయంలో ఓటర్ సవరణ జాబిత (డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్)ను మునిసిపల్ కమిషనర్ సిహెచ్ సైదులు గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ... మునిసిపాలిటీ ఓటర్ల జాబితాను మునిసిపాలిటీ ఆఫీసు నందు, తహసిల్దార్ కార్యాలయములో మరియు ఆర్ డి ఓ కార్యాలయము వద్ద ఏర్పాటు చేయడం జరిగిందని,
పట్టణ ప్రజలు ఓటర్ల జాబితాను చూసుకొని ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 8 లోపు వారి యొక్క అభ్యంతరాలను మున్సిపాలిటీ కార్యాలయం నందు సమర్పిస్తే, తగు విచారణ చేసి సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ అశోక్ రెడ్డి, కార్యాలయ సిబ్బంది ప్రదీప్, చంద్ర వార్డు ఆఫీసర్లు బిల్లు కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.