calender_icon.png 31 January, 2026 | 9:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మహాత్మా గాంధీ వర్ధంతి

31-01-2026 12:00:00 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),జనవరి 30: దేశ స్వాతంత్రం కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన మహనీయుడు మహాత్మా గాంధీ అని తహసీల్దార్ శ్రీకాంత్,ఎంపీడీఓ ఝాన్సీ,ఎంఈఓ బాలునాయక్ లు అన్నారు.మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా శుక్రవారం జాజిరెడ్డిగూడెం గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అహింసా విధానంతో కోట్ల మంది దేశ ప్రజలను ఏకతాటిపై నడిపి స్వాతంత్రం సాధించిన మహనీయుడు మహాత్ముడని,ఆయన బోధనలైన సత్యం,అహింస,శాంతి అనే సిద్ధాంతా లను ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు.

స్వదేశీ మహిళా సాధికారత,గ్రామ స్వరా జ్యం, పేదరిక నిర్మూలన వంటి బాపూజీ ఆశయాలను నిజం చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు బింగి కృష్ణమూర్తి,లూనావత్ కృష్ణనాయక్,పీఏసీఎస్ డైరెక్టర్ శిగ నసీర్ గౌడ్, శ్రీధర్ రెడ్డి,సోమయ్య,సుతారపు అనిల్, వార్డు సభ్యులు వల్లాల ఖాజా,బొల్లం సైదులు, యాదగిరి, కొప్పుల సత్తిరెడ్డి, నరేష్, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

గాంధీ ఆశయాలు సాధించాలి

తుంగతుర్తి, జనవరి 30: భారతదేశ స్వాతంత్ర సమరములో కీలక పాత్ర పోషించి, అస్పృశ్యత నివారణ కోసం కృషి చేసిన మహానీయుడు మహాత్మా గాంధీ అని ఆయన ఆశయాలను సాధించాలని ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తాటి కొండ సీతయ్య అన్నారు. శుక్రవారం గాంధీ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో పేద ప్రజల కోసం ఆయన చేసిన సేవలు కొనియాడారు.

అహింసా శాంతి సాధనములతో దేశానికి స్వాతంత్రం తెచ్చిన ఘనత గాంధీజీ అన్నారు గాంధీ ఆశయ సాధనలో ప్రతి ఒక్క ఆర్యవైశ్యులు పాలుపంచుకోవాలని, సమాజ సేవా దృక్పథం అలవర్చుకోవాలని కోరా రు. కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ సంఘం మండల అధ్యక్షులు ఈగ నాగన్న పాలవరపు సంతోష్ ,తల్లాడ కేదారి ,ఓరుగంటి అశోక్ ఓరుగంటి శ్రీనివాస్ ,ఓరుగంటి సుభాష్, తల్లాడ బిక్షం, శ్రీహరి,  వినయ్, రాఘవేంద్ర ప్రసాద్, పాల్గొన్నారు.