11-02-2025 12:00:00 AM
గోడ ప్రతులను ఆవిష్కరించిన ఆలయ కమిటీ
తిమ్మాపూర్, ఫిబ్రవరి 10: ప్రతి ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించే శ్రీ వెంకటేశ్వ రస్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వ హించేలా విజయవంతం చేయాలని ఆలయ కమిటీ చైర్మన్, టీఎన్జీవో రాష్ర్ట అధ్యక్షులు మారం జగదీశ్వర్ తెలిపారు. సోమవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్‌ఎండి కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వా మి 46వ బ్రహ్మోత్సవాలను ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా దాతలు ముందుకు వచ్చి బ్రహ్మోత్సవాలను అంగ రంగ వైభవంగా నిర్వహించేందుకు సహక రించాలని కోరారు.
ఈనెల 28 నుంచి మా ర్చి 3 వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్స వాలలో భాగంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చ ర్యలు చేపడతామని మహిళా భక్తులు కూడా అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృ పకు పాత్రులు కావాలని పేర్కొన్నారు.
కార్య క్రమంలో నీటిపారుల శాఖ ఎస్సీ గౌరవ అ ధ్యక్షులు పి.రమేష్, ఈ ఈ నాగభూషణం, ఆలయ కమిటీ ఒంటెల రవీందర్ రెడ్డి,పోలు కిషన్, జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి లక్ష్మణ్ రావు, జి.రమేష్, వి. ప్రసా ద్, కిరణ్, వేంకటేశ్వర్ రావు, ఎన్టీపీఏ, రామ చంద్ర రెడ్డి ఎన్టీపీఏ, మోహన్ రెడ్డి, అంబటి నాగరాజు, అశోక్ రెడ్డి పుప్పాల, ధన లక్ష్మి, క రుణ,రాధ, జిల్లా నాయకులు, కార్యవర్గ స భ్యులు, శ్రీ పద్మావతి మహిళా మండలి కమి టీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.