11-02-2025 12:00:00 AM
చేగుంట, ఫిబ్రవరి 10: మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలోని చందాయి పేట్, వడియారం గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నేషనల్ మెరిట్ స్కాలర్షిప్‌కు ఎంపికయ్యారు. 2024 లో నిర్వహించిన పరీక్షల్లో చందాయిపేట్ ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న మాలోత్ రాహుల్, వడి యారం ప్రభుత్వ పాఠశాలకు చెందిన వడ్ల సృజిత్ భార్గవ్, భవాని శ్రీజ ఎంపికైనట్లు ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిషన్, లీలావతి తెలిపారు, విద్యార్థులు స్కాలర్ షిప్ కు ఎంపికైనందుకు, వీరికి సహకరించిన ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు.