calender_icon.png 27 October, 2025 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డాక్టర్ల ఉత్పత్తిలోనూ తెలంగాణ ఫస్టే!

27-10-2025 01:57:49 AM

-రాష్ట్రం భారతదేశానికి దిక్సూచిగా మారింది

-ఈ ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుంది

-కేసీఆర్, హరీశ్ రావు నేతృత్వంలో 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు

-బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం ధాన్యం ఉత్పత్తి లోనే కాదు.. డాక్టర్ల ఉత్పత్తిలోనూ నెంబర్ వన్‌గా నిలుస్తుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని స్పష్టం చేశా రు. జహీరాబాద్‌లోని తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో చదివి ఎంబీబీ ఎస్‌లో సీట్లు పొందిన మైనారిటీ విద్యార్థులను కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు ఆదివారం సన్మానించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... పిల్లలు ప్రయోజకులైనప్పుడు తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారని, అంతకు మించిన ఆనందం తల్లిదండ్రులకు ఇంకేదీ ఉండదని, అందులో కేసీఆర్ పాత్ర ఉన్నందుకు మేము ఎంతో సంతోష పడుతున్నామని తెలిపారు. ఒక జహీరాబాద్ నుంచి 16 మంది ఎంబీబీఎస్ సీట్లు సాధించారని, రాష్ర్టవ్యాప్తంగా ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సైంటిస్టులు అవుతున్నారని పేర్కొన్నారు.

ఏ తల్లిదండ్రులైనా ఆడపిల్లని చదివించడానికి కులమతా లు చూడరని, మంచి వసతులు కల్పిస్తే చదివిస్తారని మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేసే ముందు కేసీఆర్ అన్నారని గుర్తు చేశా రు. 24 మైనార్టీ గురుకుల పాఠశాలలను, 100 మైనార్టీ గురుకులాలను ఆడబిడ్డల కోసం నిర్మించారని చెప్పారు. రైతు కుమార్తె, జర్నలిస్టు కుమార్తె, ఆటో డ్రైవర్ కుమార్తె ఎంబీబీఎస్ సీట్లు సాధించి గర్వంగా నిల్చున్నారని సంతోషించారు. ఇక్కడ ఎంబీబీఎస్ సీటు సాధించిన వారు.. ఇంకా పేద విద్యార్థులకు సహాయం చేయాలని, వారు కూడా ఉన్నత స్థాయికి వచ్చే విధంగా కృషి చేయాలని సూచించారు.

కేసీఆర్, హరీష్ రావు నేతృత్వంలో నాలుగు మెడికల్ కాలేజ్‌లను 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగా పెంచారని గుర్తు చేశారు.తెలంగాణ భార తదేశానికి ఒక దిక్సూచిగా మారిందన్నారు. రాజకీయాల్లోకి రావడం, వెళ్లిపోవడం సహజమని, మనం చేసిన మంచిపని వల్ల ఎవరి కైనా మంచి జరిగితే ఆ సంతోషం చాలా గొప్పగా ఉంటుందని అన్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రుల, తెలంగాణ రాష్ట్రం పేరు నిలబెట్టాలని సూచించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేసీఆర్ గురుకుల పాఠశాలలు పెట్టి మైనార్టీలకు నాణ్యమైన విద్యను అందించారని, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 203 మైనార్టీ గురుకులాలు ఏర్పా టు చేశారని గుర్తు చేశారు. సీటు సాధించిన ఒబేదు తండ్రి ఇబ్రహీం మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘మైనార్టీ గురుకులాలు మా జీవితాలను మార్చేశాయి. మా కుమారుడు డాక్టర్ చదువుతున్నాడు.

మేము చాలా సం తోషంగా ఉన్నాం’ అని తెలిపారు. ఒబేదు మాట్లాడుతూ... 2016లో మైనార్టీ గురుకులాలో అడ్మిషన్ పొంది ఇప్పుడు ఎంబీబీ ఎస్ సీట్ సాధించామంటే అది కేసీఆర్ వల్లేనే అని స్పష్టం చేశారు. విద్యార్థి తాసిల్ కమల్ మాట్లాడుతూ.. మైనార్టీ గురుకులా ల్లో ‘మమ్మల్ని సొంత పిల్లలు’గా చూసుకున్నారని, ఎంబీబీఎస్ సాధించామంటే దానికి కారణం కేసీఆరే అని తెలిపారు.