calender_icon.png 10 November, 2025 | 8:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాంఘిక సంక్షేమ హాస్టల్ సమస్యలు పరిష్కరించాలి

10-11-2025 12:01:56 AM

నాగర్‌కర్నూల్, నవంబర్ 9 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఎస్సీ సీ వసతి గృహంలో ఆదివారం ఏబీవీపీ నాయకులు విద్యార్థులతో కలిసి భోజనం చేసి సమస్యలు తెలుసుకున్నారు. రాష్ర్ట కార్యవర్గ సభ్యులు బంగారు బాబు మాట్లాడుతూ హాస్టల్లో పరిశుభ్రత, డోర్లు, పెయింట్ వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రసాద్, రమేష్, శివ, బాబు, శ్రీకాంత్, మల్లేష్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.