calender_icon.png 23 August, 2025 | 8:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పిరిట్‌తో నకిలీ మద్యం తయారీ

23-08-2025 12:26:01 AM

-ముఠా గుట్టు రట్టు చేసిన మానుకోట పోలీసులు 

-రూ. 4 లక్షల విలువైన నకిలీ మద్యం స్వాధీనం 

-ఐదుగురు వ్యక్తుల అరెస్ట్, పరారీలో మరో ఇద్దరు

మహబూబాబాద్, ఆగస్టు 22 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో స్పిరిట్ తో నకిలీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను మానుకోట పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి నాలుగు లక్షల రూపాయల విలువైన నకిలీ మద్యాన్ని, రెండు కార్లు, 60 లీటర్ల స్పిరిట్, 4,500 ఖాళీ మద్యం పెట్ బాటిల్లు, లేబుళ్లు, బాటిల్ మూతలు, ప్లాస్టిక్ డ్రమ్ము లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనలో ప్రమేయం ఉన్న మరో ఇద్దరూ పరారీ లో ఉన్నారు.

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నకిలీ మద్యం తయారు ముఠా గుట్టు రట్టుపై వివరాలను వెల్లడించారు. మానుకోట టౌన్ పోలీస్ లకు ఇల్లందు రోడ్డు లోని జ్యోతిబసు నగర్ కాలనీలో రాజగోపాల్ అనునతని గోదాములో అక్రమం గా కల్తీ మద్యం తయారు చేస్తున్నారని నమ్మదగిన సమాచారం రాగా, మహబూబాబాద్ టౌన్, ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా గోదామును తనిఖీ చేయగా అందులో కొంత మంది వ్యక్తులు ప్రభుత్వ అనుమతి లేకుండా స్పిరిట్ తో నకిలీ మద్యం తయారు  చేస్తుండగా పట్టుకున్నారని చెప్పారు.

వరంగల్ జిల్లా శాయంపేటకు చెందిన అల్లం రవీందర్ గతంలో మద్యప్రదేశ్ నుండి అక్రమంగా తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి తెచ్చి వరంగల్ ప్రాంతంలో ఎక్కువ ధరకు అమ్మేవాడన్నారు. ఆ క్రమంలో మహారాష్ట్ర నాగపూర్ కు చెందిన ఆశీష్ ఠాకూర్ అనే వ్యక్తి పరిచయం కాగా అతను కూడా అల్లం రవీందర్ లాగా అక్రమంగా దొంగ మందు అమ్మేవాడన్నారు. ఈ క్రమం లో ఖమ్మం కు చెందిన ఆర్‌ఎంపి షేక్ సాబీర్ పాపా పరిచయంతో అల్లం రవీందర్ చేసి పని ద్వారా డబ్బులు సరిపోకపోవడంతో అక్రమ మార్గంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని అనుకోని గతంలో పరిచయం ఉన్న నాగపూర్ కు చెందిన ఆశీష్ ఠాకూర్ తో కలిసి స్పిరిట్ తో నకిలీ మద్యం తయారు చేసి, అమ్మి లాదపడాలని అల్లం రవీందర్, సాబీర్ పాష కలిసి ఆశీష్ ఠాకూర్ తో మాట్లాడి అతనికి లక్షన్నర రూపాయలు ఇచ్చి అందుకు కావాల్సిన స్పిరిట్ ను అతని ద్వారా తెప్పించినారు.

ఈ క్రమంలో వీరి ఇరువురికీ వరంగల్ పెరికవాడకు చెందిన ములుగు రాజు, మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓర్పు గోపాల కృష్ణ, జక్కుల రమేష్  పరిచయం కాగా, వారు కూడా వారివారి వ్యాపారాలలో నష్టం రావడంతో అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించుట కు వీరు ఆరుగురు కలిసి ఆశీష్ రాకూర్ పంపిన స్పిరిట్ తో మానవ ఆరోగ్యానికి హాని కలిగించే నకిలీ మద్యం తయారు చేసి అమ్మడానికి మహబూబాబాద్ లోని ఇల్లందు రోడ్డు లోని జ్యోతిబసు నగర్ కాలనీలో రాజగోపాల్ కు చెందిన గోదామును ఎలక్ట్రికల్ స్టోర్ రూమ్ కోసమని అబద్దం చెప్పి నెలకు 27 వేలకు కిరాయికి తీసుకొని, ఆ గోదాములో ఆశీష్ ఠా కూర్ పంపిన స్పిరిట్, రామ్ తేజ పంపిన 180 ఎంఎల్ పరిమాణం గల ప్లాస్టిక్ బాటి ల్లు, వాటి మూతలు, మద్యం రంగు లాగా ఉండడానికి స్పిరిట్ లో కలిపి  కలర్ తో మానవ ఆరోగ్యానికి హానీ కలిగించే 2,688 నకిలీ మద్యం బాటిల్లను తయారు చేసి, వాటి పైన  ఓ మద్యం కంపెనీకి చెందిన నకిలీ స్టిక్కర్లను అంటించి, వాటిని అట్ట పెట్టెలో పెట్టి ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ చుట్టు పక్కల ప్రాంతాలకు తీసుకెళ్ళి  విక్రయించడానికి నిర్ణయించారని చెప్పారు. ఇందులో భాగంగా గురువారం సాయ్ంర తం ఓర్పు గోపాల కృష్ణ, జక్కుల రమేష్, సాబీర్ పాషా, అల్లం రవీందర్, ములుగు రాజు రెండు కార్లలో వచ్చి వాటిని తీసుకుపోవుటకు సిద్ధంగా ఉండగా మహబూ బాబాద్ టౌన్, ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారని ఎస్పీ వెల్లడించారు. వరంగల్ కు చెందిన రామ్ తేజ, మహారాష్ట్ర నాగపూర్ కు చెందిన ఆశిష్ ఠాకూర్లు ప్రస్తుతం పరారీలో ఉన్నారన్నారు.