23-08-2025 12:26:04 AM
మునిపల్లి, ఆగస్టు 22 : గోవా నుంచి హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్న వివిధరకాల ఎన్డీపీఎస్ పదార్థాలను కంకోల్ టోల్ ప్లాజా వద్ద శుక్రవారం నాడు ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఐపీఎస్ ఇ. షహనవాజ్ ఖాసీం ఆదేశాల మేరకు ఆ శాఖ మెదక్ సహాయ కమిషనర్ జి. శ్రీనివాస్ రెడ్డి, ఆధ్వర్యంలో మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద ఎక్సైజ్ శాఖ అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో గోవా నుండి హైదరాబాద్కు వివిధ రకాల పదార్థాలను తరస్తున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఆపి తనిఖీ చేయగా అందులో ఓ వ్యక్తి ఎన్డీపీఎస్ పదార్థాలైన చరస్ 108 గ్రాములు, ఎండిఎంఏ 2.90 గ్రాములు, ఎల్ ఎస్ డి పేపర్స్ 10 బ్లాట్స్, కొకైన్ 3.01 గ్రాములు, ఎండిఎంఏ ఎక్స్టసీ మాత్రలు 4.4 గ్రాములు, ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
దీంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. పట్టు బడిన పదార్థాల విలువ రూ. 2,40,000 ఉంటుందని తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ శాఖ సీఐ బి. గాంధీనాయక్, ఎస్‌ఐ బి. యాదయ్య తదితరులు ఉన్నారు.