27-08-2025 01:25:45 AM
చేర్యాల, మే 15 ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి హుండీ లెక్కింపు ను ఆలయ వర్గాలు గురువారం చేపట్టాయి. హుండీ లెక్కింపును ఆలయ ముఖమండపం వద్ద చేపట్టారు. ఈ లెక్కింపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగింది. లెక్కింపులో శివరామకృష్ణ భజన మండలి వారు పాల్గొన్నారు.
46 రోజులకు గాను రూ. 45 లక్షల 79 వేల 870 రూపాయలు నగదు రాగా, మిశ్రమ బంగారం 44 గ్రాములు, మిశ్రమా వెండి 4 కిలోల 300 గ్రాములు, విదేశీ కరెన్సీ 83నోట్లు, హుండీల ద్వారా లభించినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎస్ అన్నపూర్ణ తెలిపారు. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి పర్యవేక్షణలో లెక్కింపు కొనసాగింది. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్, ఆలయ సిబ్బంది బుద్ధి శ్రీనివాస్, సురేందర్ రెడ్డి పాలకమండలి సభ్యులు లింగంపల్లి శ్రీనివాస్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.