calender_icon.png 27 August, 2025 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ వందన ఆసుపత్రిలో అరుదైన వీ-బీఏసీ డెలీవరి

27-08-2025 01:27:12 AM

సిద్దిపేట, ఆగస్టు 25 (విజయక్రాంతి):సిద్దిపేటలోని శ్రీవందన మెటర్నిటి ఆసుపత్రిలో అరుదైన వీ-బీఏసి డెలివరీ చేసినట్లు ప్రముఖ గైనకాలజిస్ట్ వైద్యురాలు వందన బొజ్జ తెలిపారు. మంగళవారం డాక్టర్ వందన మా ట్లాడుతూ మహిళ మొదటి కాన్పులో సిజేరియన్ అయిన తర్వాత రెండవ డెలివరీలో నార్మల్ కాదని ప్రజల్లో అపనమ్మకం ఉందని, అవి అనుమానాలు మాత్రమేనని తెలిపా రు. ఆపరేషన్ ద్వారా మొదటి కాన్పు జరిగిన ఓ మహిళకు రెండవ కాన్పులో నార్మల్ డెలివరీ చేసినట్లు వెల్లడించారు.

ఈ నార్మల్ డెలివరీలో తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యురాలు వందన తెలిపారు. సిజేరియన్ తర్వాత నార్మల్ డెలివరీ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, మళ్లీ సిజేరియన్ చేస్తే ఎలాంటి ఇబ్బం దులు తలెత్తాయో వివరించారు.

ప్రయివేటు ఆసుపత్రిలో నార్మల్ డెలివరీ చేయరనే అపవాదు ఉందని, కానీ శ్రీ వందన ఆసుపత్రిలో గడిచిన రెండు వారాలలో 7 నార్మల్ డెలివరీలు చేసినట్లు తెలిపారు. తమ ఆసుపత్రిలో అన్ని రకాల కాన్పులు, పెయిన్ లెస్ నార్మల్ డెలివరీలు, గర్భసంచి ఆపరేషన్ లు, ట్యూబెక్టమీ చేస్తామన్నారు. డాక్టర్ వెంట ఓటి అసిస్టెంట్ రమేష్, స్టాఫ్ మేనేజ్మెంట్ నాగరాజు, కృష్ణమోహన్ ఉన్నారు.