calender_icon.png 17 January, 2026 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లన్న గంగతెప్ప ఊరేగింపునకు ఘన స్వాగతం

17-01-2026 03:55:20 AM

ముషీరాబాద్, జనవరి 16 (విజయక్రాంతి): ప్రతి సంవత్సరం సంక్రాంతి పండు గ రోజున భక్తి శ్రద్ధలతో జరుపుకునే పెద్ద జాతరను భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం (బాకారం)లో నిర్వహించారు. జాతర సందర్బంగా ఒగ్గు పూజారు లు, ఆలయ సమిటి సభ్యులు, ఆనవాయితీగా నిర్వహించే మల్లన్న స్వామి వారి పల్లకితో ‘గంగ తెప్ప‘ ఊరేగింపుకు గాంధీనగర్ డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి వడ్డపల్లి ఆనంద్ రావు ఆధ్వర్యంలో స్వామి వివేకానంద నగర్ బస్తీలోని శ్రీ నల్ల పోచమ్మ ఆలయం వద్ద స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ సికిం ద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, ఓబీసీ మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యులు  పూస రాజు తదితరులు పాల్గొన్నారు. ఆలయ ట్రస్తీ నల్లవెల్లి అంజి రెడ్డి,  ఒగ్గుపూజరులతో పాటు ముఖ్య అతిథులను సన్మానించి, స్వామి వారి పల్లకికి పూజలు చేసి, సాకలు పెట్టి, గంగ తెప్ప ఊరేగింపుకు ఘనంగా స్వాగతం  పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు శ్రీకాంత్, దామోదర్, విఎస్టీ రాజు, పాల శ్రీనివాస్, మదన్మోహన్, జ్ఞానేశ్వర్, సాయి కుమార్, గ్యనేశ్, సంపత్ యాదవ్, బస్తీ అధ్యక్షుడు ఎల్లం  నరేష్, పీ. రాజు, వీరేష్, రాజశేఖర్, హరినాథ్ పాల్గొన్నారు.