calender_icon.png 17 January, 2026 | 9:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ అంటేనే నమ్మకానికి భరోసా

17-01-2026 03:53:55 AM

  1. ఎల్బీనగర్ డీసీపీ అనురాధ

హయత్ నగర్, బండ్లగూడ డిపోల్లో రోడ్డు భద్రతా మాసోత్సవాలు 

ఎల్బీనగర్, జనవరి 16 : ఆర్టీసీ బస్సు నమ్మకానికి భరోసా అని ట్రాఫిక్ డీసీపీ అనురాధ అన్నారు. రోడ్డు భద్రతా మసోత్సవాల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నిర్వహించిన అలైవ్ అండ్ అర్రివ్ కార్యక్రమంలో డీసీపీ అనురాధ ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రసంగించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. బయలుదేరిన దగ్గరి నుండే గమ్యస్థానం వరకు వెళ్లి మళ్ళీ అదే స్థానం చేరే వరకు క్షేమంగా చేరుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశన్నారు,

రోడ్డు రవాణా సంస్థలో పనిచేసే డ్రైవర్స్ డ్రైవింగ్ లో పూర్తిగా నిష్ణాతులు అని, వారి మీద ఎం తో మంది జీవితాలు ఆధారపడి ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిష నల్ డీసీపీ కోటేశ్వర్ రావు, ఏసీపీ కాశి రెడ్డి, హయత్ నగర్ సీఐలు నాగరాజు గౌడ్, సంతోష్ కుమార్, హయత్ నగర్ 1, 2 డిపో మేనేజర్లు విజయ్, శ్రీనివాస్ రావు, సహాయ మేనేజర్లు సరస్వతి, శ్రీనివాస్, సురేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ డ్రైవ ర్లు యాదయ్య, మొగిలియ్యను సన్మానించారు.

డ్రైవర్లు బాధ్యతగా ఉండాలి: ఏసీపీ

బండ్లగూడ డిపోలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య, నాగోల్ సీఐ మక్బూల్ జానీ, ఎంవీఐ శ్రీధ ర్, అభిలాష్ తదితరులు మాట్లాడారు.  ఆర్టీ సీ డ్రైవర్లు రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఇతర వాహ నదారుల కంటే ఆర్టీసీ డ్రైవర్లు మరింత బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.

సరియైన విశ్రాంతి తీసుకొని సహనంతో విధు లు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ రమేష్ బాబు, అసిస్టెంట్ మేనేజర్ రమాదేవి, మెకానికల్ ఇంజినీర్ బాలయోగేశ్వరి, డిపోసిబ్బంది పాల్గొన్నారు.