calender_icon.png 4 November, 2025 | 10:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణం

03-11-2025 03:15:21 AM

ఎల్లారెడ్డిపేట,నవంబర్2 (విజయక్రాంతి): ఎల్లారెడ్డిపేట శివారులోని కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారిపై గల హెచ్ పి పెట్రోల్ బంక్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దు మాల గ్రామానికి చెందిన జాలపల్లి అంజయ్య(37) అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.

దుమాల గ్రామానికి చెందిన అంజయ్య ఎల్లారెడ్డిపేట సమీపంలోని హెచ్ పిపెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకోవడానికి వెళుతుండగా..కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన ర హదారిపై నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు ద్విచక్రవాహాన్ని ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.

అతడికి 8 నెలల క్రితమే సుస్మిత తో వివాహం జరిగిం ది.సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ రాహుల్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా రు.పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.భర్త మృతి చెందాడని విషయం తెలిసి మృతుడి భార్య,కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. దీంతో దూమల గ్రామంలో తీవ్ర విషాద చాయలు నెలకొన్నాయి.