calender_icon.png 21 November, 2025 | 1:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మస్తిష్కంపై మత్తు ప్రభావం

21-11-2025 12:00:00 AM

- మత్తు పదార్థాలకు అడ్డాగా మారిన చర్ల 

- గుప్పు మంటున్న గంజాయి జాడలు

- మత్తులో చిత్తవుతున్న కుర్ర కారు

- బడి పిల్లలకు పాకిన మత్తు పదార్థాలు

చర్ల, నవంబర్ 20 (విజయ క్రాంతి): చదువులకు దూరమై మత్తు పదార్థాలకు దగ్గరై యువత మత్తు లోకంలో నిద్రపోతుం ది గత కొంతకాలంగా చర్ల మండలంలో మ త్తు పదార్థాలు మాదకద్రవ్యాలు యువతరంపై ఘోర ప్రభావం చూపిస్తున్నాయి, ఉద యం నిద్ర లేచింది మొదలు అదే ధ్యాసగా యువత మత్తులో తూలుతోంది. మత్తు ప దార్థాలు సేవించే యువత మొత్తం ఒక చోట సిట్టింగ్ లతో సమయం వృథా చేసుకుం టూ, కన్న వారికి ఊరీ మనుషులకు దూరంగా ఎవ్వరికి కనీంచని వింత లోకం లో జీవిస్తున్నారు. ఒకరి నుంచి మరొకరికి మత్తు పదార్థాలు సప్లై చేసుకుంటూ గంజా యి వంటి మాదకద్రవ్యాలను మెదడుకెక్కించి మైండ్ పాడు చేసుంకుంటున్నారు.

ఛ త్తీస్ ఘడ్ రాష్ట్రం నుండి గంజాయి సప్లై అవుతున్నట్లు సమాచారం పోరుగు రాష్ట్రమైన ఛత్తీస్గడ్ పల్లె ప్రాంతాల నుంచి భద్రాచలం నుండి చర్ల ప్రాంతానికి గంజాయి పుష్కలంగా రవాణా అవుతున్నట్లు సమాచారం, ఇక్కడ యువత ఒక్కొక్కరిగా దానిపై మోజు పెంచుకొని మత్తుకు బానిస అవుతున్నట్లు తెలుస్తోంది. అటవి ప్రాంతం నుంచి గంజా యి ఈ ప్రాంతానికి రవాణా అవుతున్నట్లు ఒక ముఠా యువతను ఎరగా వేస్తూ గంజా వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం,గుట్టుగా యువతకు మత్తు అందించి కోట్లు గడిస్తున్నట్లు సమాచారం

స్మశాన వాటికల్లో, నిర్మానుష అటవీ ప్రాంతాల్లో గంజాయి అడ్డాలు

పగలు ప్రజల సంచారం చేయని ప్రాం తాలలో గంజాయి బ్యాచ్ సిట్టింగులు వేస్తున్నట్లు చీకటి పడిందంటే ప్రధాన అడ్డాలుగా మామిడి తోటలు, జూనియర్ కళాశాల మై దానం, స్మశాన వాటిక, గుట్టుచప్పుడు కా కుండా హాస్టల్ భవనాలపై మత్తు పదార్థాలను గంజాయి వంటి మాదకద్రగాలను య దేచ్చగా సేవిస్తున్నట్లు సమాచారం. మత్తు ప దార్థాలకు బానిసై ద్విచక్ర వాహనాలపై ముగ్గురు నలుగురు ప్రయాణిస్తూ చర్ల మం డల ప్రధాన కేంద్రాలలో హల్చల్ చేస్తున్నా రు కొందరు ఆకతాయిలు,ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం లో చీకటి పడిందంటే యుత కొన్ని గ్యాంగులుగా విడిపోయి మత్తుమందు మద్యం సేవించి మాట మాట పెరిగి పెద్ద అరుపులతో కోట్లాటలకు సై అంటున్నట్లు నిత్యం ఇటువంటి ఘటన లు జరుగుతున్నాయి అని అక్కడి స్థానికులు చెప్పుకొస్తున్నారు. 

బడి పిల్లలకు చేరిన గంజాయి మత్తుతరగతి గదిలో పుస్తకాలతో కాలక్షేపం చేసే వి ద్యార్థులు సైతం మత్తు పదార్థాలకు బానిసవుతూ తరగతి గదిలోకి గంజాయి వంటి మాదకద్రవ్యాలను బ్యాగుల్లో మోస్తున్నారు, వారి ఉజ్వల భవిష్యత్తును అయోమయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు, అందు కు నిదర్శనం కొంతకాలం క్రితం ఒక ప్రభు త్వ పాఠశాలలో విద్యార్థి గంజాయి సేవించి పాఠశాలకు రావడం గమనార్హం .

పట్టణ సంస్కృతి పల్లెకు పాకింది

ముంబై, ఢిల్లీ ,హైదరాబాద్ వంటి పట్టణాలను బ్రౌన్ షుగర్ గంజాయి మైఫా వం టి మత్తు పదార్థాలు రాజ్యమేలుతున్నవి. అటువంటిది నేడు చర్ల వంటి పచ్చని పల్లె సీమలకు ప్రమాదకర గంజాయి ప్రవేశించిం ది యువత నాడీ తెలుసుకొని వారి అలవాట్లను దారిమలించే విధంగా ఈ గంజాయి నేడు పల్లె పల్లెనా రాజ్యమేలుతుంది, యు వత తలలో మత్తు మందు పురుగులా తిరుగుతుంది.

చీకటి పడిందంటే మత్తు లోకం లోకి జారుకుంటుంది యువత ,గుప్పుమంటున్న గంజాయిగత కొంత కాలం గా ఇతర రాష్ట్రాల నుంచే కాక భద్రాచలం నుంచి కూడా చర్లకు గంజాయి సరఫరా అవుతున్న ట్లు సమాచారం, భద్రాచలం పట్టణంలో గం జాయి విచ్చలవిడిగా రాజ్యమేలతున్న విష యం తెలిసిందే, చదువుకునే యువత చెడు దారి మళ్ళీ రోడ్లపైన ఘర్షణలు పడుతూ గ్యాంగులు ఏర్పాటు చేసుకుని గల్లిలలో తిరు గు క్షణికావేశంలో ఘర్షణలు పడుతూ హ త్యలకు దారితీస్తున్న సందర్భాలు లేకపోలే దు. ఐతే చర్ల మండలం లోని కొందరు యువత భద్రాచలం నుంచి గంజాయి చర్ల మండలానికి తరలిస్తున్నట్లు ఇక్కడి నుంచి ఎక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి గంజాయి గుట్టుగా సరఫరా అవుతున్నట్లు సమాచా రం. అబ్కారీ వ్యవస్థ గుడుంబా పైనే దృష్టి సారిస్తున్నారు తప్ప అధిక శాతం గంజాయి పై దృష్టి సారించడం లేదని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

నిఘా వ్యవస్థను పెంచాలి అవగాహన కల్పించాలి

మత్తు పదార్థాలపై పోలీస్ శాఖ పలు రకాల అంశాలలో షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్స్, పాటల ద్వారా, పాఠశాలలో, కళాశాలలో సె మినార్లు ర్యాలీలు,నిర్వహిస్తూ జాగృతి కల్పిస్తున్నప్పటికీ యువత లో మార్పు తీసుకొచ్చే విధంగా మండలం లో నిఘా వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలని సంబంధిత అధి కారులు యువతకు కౌన్సిలింగ్ ఇచ్చే విధం గా కళాశాలలో పాఠశాలలో సెమినార్లు నిర్వహించి అవగాహన కల్పించాలని బాధిత అ నుమానిత యువత కుటుంబ సభ్యులతో మాట్లాడి యువతలో మార్పు తీసుకొచ్చే వి ధం ప్రయత్నం చేయాలని,పోలీస్ వ్యవస్థ పెట్రోలింగ్ నిర్వహిస్తూ సామాజికం గా ని ఘా పెంచాలని విచ్చలవిడి అమ్మకాలు చేస్తు న్న బెల్ట్ షాపులపై మద్యం షాపుల వద్దకు గంజాయి సప్లై చేస్తున్న వారిపై నిఘా పెంచి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.