15-08-2025 01:26:33 AM
ఘట్‌కేసర్, ఆగస్టు 14 : ట్రా ఫిక్ కానిస్టేబుల్‌పై దాడి చేసిన వ్యక్తి ని ఘట్ కేసర్ పో లీసులు గురువా రం రిమాండ్ తరలించారు. ఘట్ కేసర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నందు విధు లు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఎస్. కృష్ణ ఈనెల 13 సాయం త్రం 5.30 గంటలకు యంనంపేట్ చౌర స్తా వద్ద ట్రాఫిక్ విధుల్లో ఉండగా జూలూరు గ్రామానికి చెంది న పెన్నింటి అజయ్ రెడ్డి వయసు (27) తన వోక్స్వేగన్ పొలో కారు రాంగ్ రూట్ తీసుకొని వెళ్తుండగా ఆబండి కానిస్టేబుల్ కృష్ణ ఆపడానికి ప్రయత్నించగా కార్‌లో ఉన్నటువంటి అజయ్ రెడ్డి తాగిన మైకంలో కానిస్టేబుల్ పైకి దురుసుగా ప్రవర్తిస్తూ బూతు మాటలు తిడుతూ దాడి చేసినాడు. ఇది వీడియో తీయడానికి ప్ర యత్నించగా అతని యొక్క మొబై ల్‌ను తీసుకొని పగలగొట్టినాడు. ఇట్టి సంఘటనలో కృష్ణ ఫిర్యాదు మేరకు అజయ్ రెడ్డిపై కేసు నమోదు అయినది. దర్యాప్తులో అజయ్ రెడ్డిని అదుపులోకి తీసుకొని జ్యూడిషియల్ కస్టడీ కొరకు కోర్‌లో హాజరు పరిచామని పోలీసులు తెలిపారు.