calender_icon.png 15 August, 2025 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ స్వాతంత్ర వేడుకలకు పంచాయతీ కార్యదర్శి

15-08-2025 01:27:51 AM

యాచారం ఆగస్టు 14 : ఢిల్లీలో ఎర్రకోటలో జరిగే 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు యాచారం మండలం మాల్ గ్రామపంచాయతీ సెక్రటరీ వై వి రాజుకు ఆహ్వానం అందింది. 2025 సంవత్సరంలో “ఆత్మ నిర్భర్ పంచాయతీ” విభాగంలో  మాల్ గ్రామపంచాయతీకి  జాతీయ ఉత్తమ పంచాయతీ అవా ర్డు ఏప్రిల్ 23న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అందుకున్న విషయం విధితమే.  ఈ నేపథ్యంలో ఆగస్టు 15న ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవానికి ప్రత్యేక అతిథిగా హాజరుకావాలని రాజుకు ఆహ్వానం అందగా, ఆయన ఢిల్లీ బయలుదేరారు.