calender_icon.png 15 August, 2025 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైసీపీ ఇలాఖాలో టీడీపీ జెండా రెపరెప

15-08-2025 01:26:26 AM

  1. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల్లో సైకిల్ పార్టీ ఘనవిజయం
  2. పులివెందులలో వైసీపీకి డిపాజిట్ గల్లంతు

హైదరాబాద్, ఆగస్టు 14: ఆంధ్రప్రదేశ్‌లోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థా నాలకు జరిగిన టీడీపీ ఘనవిజయం సాధించింది. ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత ఇలా ఖాలో పులివెందులలో టీడీపీ ఘన విజయం సాధించడం విశేషం. ఇక్కడ టీడీపీ నుంచి బరి లో నిలిచిన లతారెడ్డి 6,035 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి హేమంత్‌రెడ్డికి కనీసం డిపాజిట్ దక్కలేదు.

హేమంత్‌రెడ్డికి 683 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులు, కాంగ్రెస్‌కు వందలోపు ఓట్లు లభించాయి. పులివెందుల స్థానం కోసం టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌తో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 11 మంది బరిలో నిలిచారు. ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి విజయం సాధించారు. ఉప ఎన్నికలో కృష్ణారెడ్డికి 12,780 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు వచ్చాయి. దీంతో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి 6,267 ఓట్లతో విజయం సాధించినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది: మంత్రి సవిత

పులివెందుల ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి విజయం సాధించడం పట్ల ఏపీ చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందని పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవానికి ఒకరోజు ముందే పులివెందులకు స్వేచ్ఛ లభించిందంటూ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ పులివెందుల కోటను బద్ధలు కొట్టి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.