calender_icon.png 7 May, 2025 | 6:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్లు, మురుగు సమస్యను పరిష్కరించండి

04-05-2025 12:31:36 AM

మున్సిపల్ కమిష్‌నర్‌కు ఆదర్శనగర్ వాసుల వినతి 

చేవెళ్ల, మే 3 : రోడ్లు, మురుగు నీటి సమస్యను పరిష్కరించాలని శంకర్పల్లి మున్సిపల్ పరిధి సింగాపూర్ వార్డులోని ఆదర్శ్ నగర్ వెల్ఫేర్ సొసైటీ కాలనీ వాసులు కమిషనర్కు విన్నవించారు. శనివారం శంకర్పల్లి పురపాలక సంఘం కార్యాలయంలో కమిషనర్ యోగేశ్ను కలిసి వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. ఆదర్శ్నగర్ కాలనీ ఏర్పడి దాదాపు 20 సంవత్సరాలు అయినా అస్థవ్యస్థంగా రోడ్లు, మురుగు నీరు సాఫీగా వెళ్లేందుకు వీలు లేకుండా ఉందని అన్నారు. వేల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేసి నాలుగు సంవత్సరాలు అయిందని, అప్పటి నుంచి వేల్ఫేర్ సొసైటీ సహకారంతో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, మట్టి రోడ్డు తదితర మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు.

ప్రస్తు తం మున్సిపాలిటీ నుంచి రోడ్డు, డైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరామన్నరు. దీనికి కమిషనర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. కమిషనర్ను కలిసిన వారిలో ఆదర్శ్నగర్ కాలనీ అధ్యక్షుడు వై.రాంచందర్, ప్రధాన కార్యదర్శి బి.రాము లు, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు ఎస్.రవీందర్, ఎం.శ్రీనివాస్, కోశాధికారి బి.నారాయణ, కాలనీ సభ్యుడు బి.మాణిక్యం, కాలనీవాసులు తదితరులు  ఉన్నారు.