calender_icon.png 29 May, 2025 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పద్మశ్రీ స్వీకరించిన మందకృష్ణ

28-05-2025 01:56:27 AM

  1. ఘనంగా ‘పద్మ’ అవార్డుల రెండో విడత ప్రదానోత్సవం

ఈ విడతలో 68 మందికి అవార్డుల ప్రదానం

ఏపీ నుంచి ప్రొఫెసర్ కేఎల్ కృష్ణ, రాఘవేంద్రాచార్య

న్యూఢిల్లీ, మే 27: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ‘పద్మ’ పురస్కారాల రెండో విడత ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి వి.రాఘవేంద్రాచార్య పంచముఖి, ఫ్రొఫెసర్ కేఎల్ కృష్ణ పద్మశ్రీ అవార్డులను స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా తదితరులు హాజరయ్యారు. రెండో విడతలో మొత్తం 68 మంది పద్మ అవార్డులు అందుకున్నారు. భారత రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌ను అందుకున్నవారిలో రిటైర్డ్ జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్‌తో పాటు కథక్ డ్యాన్సర్ అయిన కుముదిని రాజనీకాంత్ లఖియా, ఫోక్ సింగర్ శారదా సిన్హా తరఫున వాళ్ల బంధువులు ముర్ము చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు.

ఇక తొమ్మిది మంది పద్మ విభూషణ్ స్వీకరించారు. వారిలో నటులు శోభన, అనంత్ నాగ్‌తో పాటు వ్యాపారవేత్త కుప్పుస్వామి చెట్టి, ఆర్కియాలజిస్ట్ కైలాశ్ నాథ్, నృత్యకారుడు జతిన్ గోస్వామి, దుర్గా వాహిని స్థాపకురాలు సాద్వి రితాంబరతో పాటు వ్యాపారవేత్త బిబేక్ దేబ్రోయ్, మాజీ లోక్‌సభ స్పీకర్ మనోహర్ జోషీ తరఫున వారి కుటుంబసభ్యులు అవార్డు అందుకున్నారు. కేంద్రం మొత్తం 139 మంది పద్మ అవార్డులు ప్రకటించిన తెలిసిందే. వీరిలో ఏడుగురు పద్మవిభూషణ్, 19 మంది పద్మభూషణ్, 113 మంది పద్మశ్రీకి ఎంపికయ్యారు.