calender_icon.png 21 August, 2025 | 8:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండల బిజెపి కార్యవర్గం ఎన్నిక

21-08-2025 05:57:10 PM

మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) కాటారంలో మండల కేంద్రంలో ఐదు మండలాల బిజెపి కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథులుగా బిజెపి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి మాజీ జిల్లా అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి, చల్ల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో మహదేవపూర్ బిజెపి పార్టీ నూతన మండల కమిటీని ఎన్నిక చేయడం జరిగింది.

మహదేవపూర్ మండల అధ్యక్షునిగా రామ్ శెట్టి మనోజ్ కుమార్, ఉపాధ్యక్షులుగా అన్కారి రాజేందర్, సూరం మహేష్, శనిగరం కిష్టయ్య, ఆకుల మధుకర్, మండల ప్రధాన కార్యదర్శిగా గుజ్జుల శంకర్, బొల్లం కిషన్, లింగంపల్లి వంశీ, బల్ల శ్రవణ్ కుమార్, కార్యదర్శులుగా బంధుగుల సంతోష్, గొర్రె శ్రీకాంత్, ఎం.ఆర్ యాదవ్, శ్యామల ప్రశాంత్, కోశాధికారిగా ఊదరి పూర్ణచందర్, కిసాన్ మోర్చా అధ్యక్షులు ఓడేటి బాలిరెడ్డి, ఓబీసీ మోర్చ అధ్యక్షులు సాగర్ల రవీందర్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు బూడె శేఖర్, ఎస్టీ మోర్చా అధ్యక్షులుగా దుగ్యాల రాము నియమించినట్లు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవరెడ్డి తెలిపారు.

జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ... ప్రతి కార్యకర్త బిజెపి బలోపేతానికి కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి గెలుపు కోసం ప్రతి ఒక్కరు కష్టపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐదు మండలాల అధ్యక్షులు పూర్ణ చందర్, శ్రీకాంత్, దుర్గం తిరుపతి, బండం మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.