21-08-2025 05:58:53 PM
కలెక్టర్ కుమార్ దీపక్..
మంచిర్యాల (విజయక్రాంతి): జిల్లాలోని జైపూర్ మండలం వేలాల స్టాక్ యార్డ్ లో ఉన్న ఇసుకను టిజిఎండిసి సాండ్ బజార్ నుంచి తరలించేందుకు అనుమతి మంజూరు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అన్నారు. కలెక్టర్ ఛాంబర్ లో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వేలాల స్టాక్ యార్డులో ఉన్న 20 వేల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలను టి.జి.ఎం.డి.సి. సాండ్ బజార్ కు కేటాయించడం కొరకు సమర్పించిన ప్రతిపాదనలను ఆమోదించడం జరిగిందని తెలిపారు.
ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మండలాలలో ఇసుక బజార్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని, నిరంతర వర్షపాతం కారణంగా జిల్లాలో ఇసుక సేకరణలో అంతరాయం ఏర్పడిందని, ర్రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ముతక ఇసుక అవసరం ఉన్నందున జిల్లాకు పంపిన ప్రతిపాదన మేరకు, నీటిపారుదల శాఖ, టి.జి.ఎం.డి.సి. జిల్లా రికార్డుల ప్రకారం, ప్రస్తుతం వేలాల స్టాక్‌యార్డ్‌లో అందుబాటులో ఉన్న సుమారు 20 వేల మెట్రిక్ టన్నుల ఇసుకను కేటాయించి రవాణా చేయడానికి అనుమతించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గనులు భూగర్భ శాఖ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.