calender_icon.png 17 September, 2025 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రోన్లను రైతులకు అందుబాటులోకి తెస్తాం

17-09-2025 12:41:26 AM

ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి 

నిజామాబాద్ సెప్టెంబర్ 16 (విజయ క్రాంతి): సహకార బ్యాంకులను దాదాపు 100 సంవత్సరాల కంటే ముందు రైతుల అభివృద్ధి కొరకు స్థాపించడం జరిగిందని రైతులు పండించిన పంటకు రైతులకు లాభం చేకూరాలని ఆలోచనతో సహకార రంగాలను ప్రారంభించడం జరిగిందని, సహకార సంఘాలు రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారికి సహాయ సహకారాలు అందించాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు.

రైతులకు అందుబాటులోకి డ్రోన్లను తెస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మంగళవారం నిజామాబాద్ లోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నందు అధ్యక్షులు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమీక్ష సమావేశంలో మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సంఘ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ యొక్క లావాదేవీలను సంస్థ అభివృద్ధిని అధికారులకు ఆడికి తెలుసుకున్నారు.

అనంతరం సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రైతులు క్షేమంగా ఉంటేనే సహకార సంఘాలు అభివృద్ధి చెందుతాయని సుదర్శన్ రెడ్డి అన్నారు. గతంలో ఉన్న ప్రతినిధుల ద్వారా సంస్థ నష్టాల్లోకి వెళితే ప్రస్తుతం నూతనంగా వచ్చిన కార్యవర్గ సభ్యులు అధికారులు కలిసి 17 శాతం నష్టాల్లో ఉన్న సంస్థను 10 శాతం రికవరీ చేసి లాభాల్లోకి తీసుకువచ్చినందుకు వారికి అభినందనలు తెలిపారు.

అదేవిధంగా ప్రభుత్వ కంపెనీ అయిన ఇఫ్కో రసాయనిక యూరియా చల్లడం బదులు నానో యూరియా స్ప్రే మెరుగ్గా ఉంటుందని ఆలోచనతో యూరియాను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబర్ గడుగు గంగాధర్,మాజీ పిసిసి ప్రధాన కార్యదర్శి నాగేష్ రెడ్డి,

నూడ చైర్మన్ కేశ వేణు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతా రెడ్డి రాజారెడ్డి,పిసిసి డెలిగేట్ గంగా శంకర్ ,వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యంరెడ్డి, బాల్కొండ మండల కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్,ఏడాపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు పులి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.