calender_icon.png 14 October, 2025 | 10:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు

14-10-2025 05:44:01 PM

ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం..

బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు సంతోష్ రెడ్డి..

ముస్తాబాద్ (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముస్తాబాద్ మండల కేంద్రంలో బిజెపి నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అభినందించారు. ఈ సందర్బంగా సంతోష్ రెడ్డి మాట్లాడుతూ రాజన్న ఆలయం అభివృద్ధిలో భాగంగా దర్శనానికి వచ్చే భక్తులను నిలిపివేస్తూ ఏకాంత సేవలు మాత్రమే జరుగుతాయని, అర్జిత సేవలు చేయడానికి రాజన్న దర్శనార్ధం కోసం భీమన్న ఆలయంలోకి మార్చడాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ చేసిన ఆందోళన చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్ర సహాయక మంత్రి కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్ కొన్ని సూచనలను ఆలయ కమిటీకి తెలియజేయడం జరిగిందన్నారు.

హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండా భక్తుల నమ్మకాలను వమ్ము చేయకుండా రాజన్న ఆలయ ఆవరణలోనే దర్శనాలను ఏర్పాటు చేస్తూ అదే రకంగా అర్జిత సేవలను కూడా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ హిందువులు విశ్వాసంతో చేసే కార్యక్రమాలు అభివృద్ధికి ఎప్పుడూ వ్యతిరేకం కాదని వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధిని బిజెపి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తుందన్నారు. పార్లమెంటు సభ్యుల సూచనల మేర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు సంతోష్ రెడ్డి, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ఎదునూరి గోపి అసెంబ్లీ కన్వీనర్ కమల్లారెడ్డి, శ్రీనివాస్ రావు, పద్మ, మండల ఉపాధ్యక్షుడు మహేశ్, సత్తయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.