calender_icon.png 3 May, 2025 | 10:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం..

10-04-2025 06:56:12 PM

కొండపాక (విజయక్రాంతి): సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం అని గురువారం బిఆర్ఎస్ పార్టీ కొండపాక మండల అధ్యక్షుడు నూనెకుమార్ యాదవ్ అన్నారు. కొండపాక మండలం దుద్దెల గ్రామానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులు జక్కుల మమతకు రూ.13,500, కురాటి లావణ్యకు రూ.9,500, సంగు రమణకు రూ.17,500 చెక్కులను బిఆర్ఎస్ పార్టీ కొండపాక మండల అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ.. మాజీమంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి సహకారంతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలకు ఎంతో ఆసరాగా ఉంటుందని అన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యా వైద్యం పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, మాటలకు పరిమితం కాకుండా ప్రజల బాగోగుల కోసం, శ్రద్ధ వహించి పనిచేయాలని ఇతవు పలికారు. విద్య వైద్యం పట్ల ప్రత్యేక చొరవ తీసుకొని కేసిఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ముందు వరసలో నిలబెట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ ఎస్టీ సెల్ అధ్యక్షులు శ్యామ్, యువజన నాయకులు గుర్రాల రాజు, ఆరెళ్ళ అఖిల్ గౌడ్, గాదగోని రాకేష్ గౌడ్, చిక్కుడు సాయి తదితరులు పాల్గొన్నారు.