19-09-2025 12:00:00 AM
చొప్పదండి 18 సెప్టెంబర్ (విజయ క్రాంతి): చొప్పదండి మండలంలోని ఆర్నకొండ గ్రామం నుంచి మల్యాల క్రాస్ రోడ్డు వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.50 కోట్లు నిధులను మంజూరు చేయించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్ర పటానికి అర్నకొండ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు గడమల్ల గంగారం ఆద్వర్యంలో పాలాభిషేకం చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఈ రోడ్డు నిర్మాణం కోసం ఎదురు చూస్తున్న చొప్పదండి మండల ప్రజలకే కాకుండా నియోజకవర్గంలోని నాలుగు మండలాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరు గుపడడంతో పాటు ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న దర్శనానికి ప్రయాణభారం తగ్గుతుందన్నారు. ఇట్టి రోడ్డు నిర్మాణానికి నిదులు మంజూరు చేయించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గార్లకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మచ్చ రమేష్, సోమిడి శ్రీనివాస్,చిలుముల స్వప్న, గర్శకుర్తి సునీత,ఇరుకుల్ల సంతోష్, పిట్ట కనుకయ్య, గడ్డం తిరుపతి రెడ్డి, ఎల్లలా సంతోష్ రెడ్డి, చార్ల లక్ష్మారెడ్డి, కాటం రాములు, తమ్మడి శ్రీనివాస్, తమ్మడి మహేష్, తమ్మడి లచ్చయ్య, మొగిలి రమేష్, జక్కుల కొమురయ్య, బూస అజయ్ కుమార్, దామెర నాగరాజు బొమ్మిడి శ్రీనివాస్, లంక గగన్, రాపల్లి హరీష్, కడారి అశోక్, దొంత శ్రీధర్, దూస చంద్రమౌళి.చీకట్ల లింగయ్య కార్యకర్తలుపాల్గొన్నారు