26-01-2026 01:37:29 AM
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌లో చేరిన మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్
ఆదిలాబాద్, జనవరి 25 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికలవేళ ఆదిలాబాద్ లో బీఆర్‌ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. గత కొంతకాలంగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్నతో ఉన్న విభేదాల కారణంగా మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ రంగినేని మనిషా పవన్‌రావ్ పార్టీకి ఎట్టకేలకు గుడ్ బై చెప్పారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కన్వీనర్ చేతుల మీదుగానే సభ్యత్వం తీసుకొన్నారు. ఈ మేరకు మనిషా మాట్లాడుతూ... బీఆర్‌ఎస్ పార్టీలో స్వార్థ రాజకీయాలతో విసుగు చెందానని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఛైర్పర్సన్ గా పని చేసినప్పుడు ఆదిలాబాద్ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సైతం తమ ప్యానెల్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మీడియా సమావేశంలో పలువురు పాల్గొన్నారు.