calender_icon.png 26 January, 2026 | 8:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముచ్చర్లపల్లిలో విషాదం

26-01-2026 01:36:39 AM

  1. నీటికుంటలో మునిగి ముగ్గురు చిన్నారుల మృతి
  2. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘటన

కల్వకుర్తి జనవరి 25: నాగర్‌కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలంలోని ముచ్చర్లపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ పొలంలోని నీటి కుంట లో మునిగి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం గ్రామానికి చెందిన మధు సిరి (14), శ్రీమాన్య (12), రంగారెడ్డి జిల్లా రావిర్యాలకు చెందిన స్నేహ (17) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

హైదరాబాదులో నివసిస్తున్న వీరు సెలవుల నిమిత్తం గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా ఈతకు వెళ్లి నీటి కుంట లోతు అంచనా వేయలేక మునిగి మృతి చెందిన ట్లు సమాచారం.ఈ సంఘటనతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుం బ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.