calender_icon.png 30 October, 2025 | 7:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

51 మంది మావోయిస్టులు లొంగుబాటు

30-10-2025 12:00:00 AM

లొంగిపోయిన వారిలో 9 మంది మహిళలు, 42 మంది పురుషులు

జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించిన అధికారులు

చర్ల, అక్టోబర్ 29 (విజయక్రాంతి): చర్ల సరిహద్దు రాష్ట్రమైన చత్తీస్‌ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో 51 మంది మావోయిస్టు కార్యకర్తలు బుధవారం జనజీవన స్రవంతిలోకి తిరిగి వచ్చారు.‘ పూనా మార్గెం.. పునరావాసం ద్వా రా పునర్జన్మ పథకం కింద జనజీవన స్రవంతిలోకి చేరిన మావోయిస్టు కార్యకర్తల్లో 9 మంది మహిళలు, 42 మంది పురుషులు ఉన్నారు, వీరికి మొత్తం రూ.66 లక్షల రివార్డు ప్రకటించారు.

ఈ 51 మంది కార్యకర్తల్లో పీఎల్‌జీఏ బెటాలియన్ కంపెనీ నంబర్ 01, 02, 05, ఏసీఎం-01, ప్లాటూన్ ఏరియా కమిటీ పార్టీ సభ్యులు - 07, ఎల్‌ఓఎస్ సభ్యులు - 03, మిలిషియా ప్లాటూన్ కమాండర్ -01, మిలిషియా ప్లాటూన్ సభ్యులు -14, మరియు ఆర్ పీ సి-జంతన సర్కార్, డీకేఎంఎస్, సీఎన్‌ఎం- 20 యొక్క అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, సభ్యులు ఉన్నారు.

చత్తీస్‌ఘడ్ రాష్ట్ర ప్రభుత్వం వారికి పునరావాస ప్రోత్సాహకంగా 50వేలు మొత్తాన్ని అందిస్తుంది. పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ జితేంద్ర కుమార్ యాదవ్ ఒక ప్రకటన చేస్తూ మావోయిస్టులు తమ తప్పుదారి పట్టించే సిద్ధాంతాలను విడిచిపెట్టి, నిర్భయంగా సమాజ ప్రధాన స్రవంతిలోకి తిరిగి రావాలని విజ్ఞప్తి చేశారు.