calender_icon.png 7 May, 2025 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మవారి మహిమతో ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలి

07-05-2025 01:06:16 AM

- జోగులాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు 

- తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

గద్వాల  మే 06 ( విజయక్రాంతి ) : శ్రీ జోగులాంబ అమ్మవారి మహిమతో తెలంగాణలో ప్రజల సమస్యలు పరిష్కారమై, వారు సుఖసంతోషాలతో జీవించేందుకు ప్ర భుత్వానికి శక్తి,సామర్థ్యం కలగాలని ప్రార్థించినట్లు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.

మంగళవారం సాయత్రం కుటుంబ సమేతంగా అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించిన తెలంగాణ శా సనసభ స్పీకర్ గారికి దేవాలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముం దుగా శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాల యం సందర్శించి అభిషేకాలు అర్చనలు నిర్వహించారు.

ఈ సందర్బంగా విఘ్నేశ్వర అభిషేకం కూడా నిర్వహించారు. అనంతరం శ్రీ జోగులాంబ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు అమ్మవారి ప్రసాదం శేష వస్త్రం బహుకరించి ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ జోగులాంబ అమ్మవారిని ప్రార్థించి,ప్రజలకు సేవ చేయడానికి అనుకూల పరిస్థితు లు కల్పించి,వర్షాలు పడాలని కోరుకుం టూ,ప్రజల సమస్యలను పరిష్కరించి, వారు సంతోషంగా ఉండేలా ప్రభుత్వానికి శక్తి ఇ వ్వాలని  ప్రార్థించినట్లు స్పీకర్ తెలిపారు.ప్ర జల సంక్షేమం కోసమే ప్రభుత్వం కట్టుబాటు తో పనిచేస్తోందని తెలిపారు.

ఆలంపూర్ దే వాలయ అభివృద్ధి గురించి ప్రభుత్వం దృ ష్టికి తీసుకువెళ్ళి,నిధులు మంజూరు అయ్యేవిధంగా  కృషి చేస్తానని అన్నారు.అంతకు ముందు హరిత హోటల్లో జిల్లా కలెక్టర్ బి. యం.సంతోష్,జిల్లా ఎస్పీ  శ్రీనివాస రావు పుష్పగుచ్ఛం అందజేసి,తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి స్వాగతం పలికారు.అనంతరం  పోలీసుల గౌ రవ వందనాన్ని స్వీకరించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్, జి ల్లా ఎస్పీ శ్రీనివాస రావు,అలంపూర్ ఎమ్మె ల్యే విజయుడు,దేవాలయ కమిటీ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి,ఆర్డిఓ రామచందర్, ఈ.ఓ పు రేందర్, మున్సిపల్ కమిషనర్ దశరథ్, స్థాని క అధికారులు తదితరులు పాల్గొన్నారు.