03-11-2025 06:12:04 PM
దేవరకొండ (విజయక్రాంతి): భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని దేవరకొండ ఎమ్మెల్యే కార్యాలయం ముందు నిరసన తెలియజేసి ఆఫీస్ సిబ్బందికి సోమవారం ఎస్ఎఫ్ఐ నాయకులు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎస్ఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు జల్లెల ఇద్దిరాములు, బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ కాలేజీలు సమ్మెకు పోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటు అన్నారు.
రాష్ట్రంలో పేద మధ్యతరగతి విద్యార్థులకు స్కాలర్షిప్ విడుదల చేయకపోవడంతో ఉన్నత చదువులకు వెళ్లాల్సిన ఎస్సీ, ఎస్టీ బీసీ,మైనార్టీ పేద విద్యార్థులు కళాశాలలో సర్టిఫికెట్ల కోసం వెళ్తే ఫీజులు పెడితేనే సర్టిఫికెట్లు టీసీలు ఇస్తామంటూ విద్యార్థులన. ఇబ్బందులకు గురి చేస్తూ విద్యార్థుల దగ్గర ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తున్నారు. వెంటనే స్కాలర్షిప్ బకాయిలు చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు గుండాల మల్లేష్,రాజేష్,రోహన్ రసమళ్ళ సింహాద్రి,నేతళ్ళ జయరాం, మహేష్ తదితరులు పాల్గొన్నారు