calender_icon.png 10 August, 2025 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోదండ రామాలయంలో సామూహిక కుంకుమార్చన

06-08-2025 12:09:06 AM

నేరేడుచర్ల, ఆగస్టు 5 : పట్టణంలోని తాహసిల్దార్ కార్యాలయం సమీపంలో గల శ్రీ కోదండ రామాలయంలో శ్రావణమాసం సందర్భంగా మంగళవారం లక్ష్మీ అమ్మవారికి అత్యంత భక్తిశ్రద్ధలతో వేదమంత్రాలతో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. ఆలయ పూజారి బృందావనం తేజ ఆధ్వర్యంలో ఆలయంలో కొలు వైన శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, అనంతరం విశ్వక్సేన పూజ పుణ్యాహవాచన  అమ్మవారి వెండి ప్రతిమకు అభిషేకం చేసి  అమ్మవారికి భక్తులచే సామూహిక కుంకుమ అర్చన  చేయిం చారు.

అభిషేకాలు కుంకుమార్చనలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసా దాలు స్వీకరించారు. ఈ పూజా కార్యక్రమాలలో ఆలయ కమిటీ చైర్మన్ కొణతం సత్యనారాయణ రెడ్డి, పులిజాల వెంకటరమణ రావు, ఉప్పల కృపాకర్, చింతకుంట్ల పూర్ణచంద్రారెడ్డి, యడవల్లి వెంకటరెడ్డి, జెట్టి వెంకటేశ్వర్లు, సైదయ్య,  రాచకొండ విజయ్, దేవేందర్, కొణతం చిన లచ్చిరెడ్డి, కాంపెల్లి నారాయణరెడ్డి, రాచకొండ చంద్రశేఖర్, తాటికొండ శ్రీరామ్ రెడ్డి, తాటికొండ నర్సిరెడ్డి, మెట్టు వేణుగోపాల్ రెడ్డి, లక్ష్మారెడ్డి లతోపాటు మహిళా భక్తులు పాల్గొన్నారు.