calender_icon.png 13 September, 2025 | 8:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీగా గంజాయి సాగు

13-09-2025 07:01:00 PM

ఎక్సైజ్ అధికారులపై అనుమానాలు 

జుక్కల్: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం హంగర్గా గ్రామంలో వ్యవసాయ భూమిలో అంతర పంటలో భాగంగా గంజాయి సాగు చేస్తున్నట్టు విశ్వసినియ సమాచారం మేరకు ఎక్సెజ్ పోలీసులు, రెవిన్యూ అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. గ్రామానికి చెందిన వీరేశం అనే రైతు తన వ్యవసాయ భూమిలో కంది, సోయా పంటలు సాగు చేసుకుంటున్నాడు. అదేవిధంగా ఆ పంటల్లోనే అంతర పంటగా 147 గంజాయి మొక్కలను పండించాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి స్థానికులు చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఈ విషయం ఎక్సైజ్ అధికారులకు తెలుపగా వారు రెవిన్యూ సిబ్బందితో కలిసి ఒక్క సంవత్సరం మేరకు ఆ రైతు యొక్క భూమిలో పరిశీలించి గంజాయి మొక్కలను ధ్రువీకరించారు. అయితే ఈ విషయంపై గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరేశం అనే రైతు గంజాయి సాగు చేస్తున్న రైతు విషయం ఆప్కారి అధికారులకు ముందే తెలిసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

గ్రామస్తులు చెప్పేంతవరకు వారు పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇదే తరహాలో  కొన్నేళ్ళ క్రితం పెద్దగుల్లా, కౌలాస్, వజ్రకండి గ్రామ శివారులో కూడా వ్యవసాయ భూమిలో పత్తి పంటలో అంతర పంటగా భారీగా గంజాయి సాగు చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం కూడా మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలలో అటవీ ప్రాంతాల వ్యవసాయ భూములలో, ఎకరాల పరిధిలో వ్యవసాయ భూమిలో గంజాయి సాగు చేస్తున్నారని తెలిసిన ఎక్సైజ్ అధికారులు కన్నెత్తి చూడకపోవడం పట్ల పలువురు పలు విధాలుగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ గంజాయి పట్టుకున్న వారిలో బిచ్కుంద ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ, జుక్కల్ తహసిల్దార్ మారుతి, ఆర్ ఐ రామ్ పటేల్, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.