19-09-2025 12:00:00 AM
దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్
దేవరకొండ, సెప్టెంబర్ 18(విజయక్రాంతి): దేవరకొండ పట్టణంలోని జడ్.పి.హెచ్.ఎస్ బాలుర పాఠశాలలో 69వ స్కూల్ గేమ్ ఫెడరేషన్ దేవరకొండ నియోజక వర్గ స్థాయి అండర్ 14&17 బాల, బాలికల క్రీడల పోటీలను గురువారం దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలను అలవాటు చేసుకోవాలని సూచించారు.
దేవరకొండ నియోజక వర్గంలో క్రీడల అభివృద్ధి కోసం చర్యలు చేపడతామని వెల్లడించారు.దేవరకొండ పట్టణం లోని జూనియర్ కళాశాలలో మినీ స్టేడియం నిర్మాణం కొరకు 2కోట్ల రూపాయలు మంజూరు అయిందని త్వరలో నిర్మాణ పనులు మొదలుపెడతామని వారు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు,నాయకులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.