calender_icon.png 2 October, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుర్గామాత దీవెనలతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలి

02-10-2025 12:00:00 AM

కమాన్ పూర్ మండలంలో దుర్గామాతకు ప్రత్యేక పూజలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు

కమాన్ పూర్, అక్టోబర్ 01 విజయక్రాంతి: దుర్గామాత దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలనిరాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం మండలం లోని పలు దుర్గామాత విగ్రహాలను మంత్రి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కిష్టం పల్లెలో హనుమాన్ దేవాలయం, చత్రపతి శివాజీ యూత్, సుభాష్ యూత్, ఆదర్శనగ ర్ దుర్గామాతలను దర్శించుకునారు.

మంత్రిని సముద్రాల వేణుగోపాల చారి మంత్రి శ్రీధర్ బాబును ఆహ్వానించి ఆయనతో అర్చ న చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంథని నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, అ మ్మవారి దీవెన ప్రజలందరిపై ఉండాలని, ఈ ఏడు పంటలు పుష్కలంగా పండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దుర్గామాత మండపాల నిర్వహకులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.