02-10-2025 12:00:00 AM
కరీంనగర్, అక్టోబరు 1 (విజయ క్రాంతి) : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని, ఆరు గ్యారెంటీలతో, 420 హామీలతో ప్రజలను మోసం చేసిన నేటి కాంగ్రెస్ ప్రభుత్వ తీరును, అధికారంలో ఉండి అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచు కున్న బిఆర్ఎస్ వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు అన్నారు.
కరీంనగర్ బిజెపి జి ల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అధ్యక్షతన బుధవారం పార్లమెంటు కార్యాలయంలో జరగబోయేస్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ ముఖ్య నేతలు, మండల అధ్యక్షులు, ప్ర బారీలు, ఇన్చార్జిలతో సమావేశం నిర్వహించారు. ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రామచందర్ రావు స్థానిక సంస్థల ఎన్నికల పై పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేశా రు. దేశాన్ని 60 ఏళ్లు ఏలిన కాంగ్రెస్ పార్టీ గ్రామాల అభివృద్ధి కోసం చేసిందేమిలేదని విమర్శించారు.
2014లో అధికారంలోకి వ చ్చిన బిజెపి మోడీ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి , ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. నేడు గ్రామపంచాయతీలో జరుగుతున్న ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలన్నీ మోది ప్రభుత్వమే చేస్తున్నవేనన్నారు.
గ్రామ పాలన వ్యవస్థ కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తంగా మారిందన్నారు. గ్రా మాల్లో సమస్యలు రాజ్యమేలుతున్న అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల సమ యం కావస్తున్న పంచాయతీలకు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రె స్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం భయపడుతుందన్నారు.
6 గ్యారంటీలు, లెక్కలేని హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ కు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలనే ఆ లోచనలో ప్రజలందరూ ఉన్నారని తెలిపా రు. గత బిఆర్‌ఎస్, నేటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరు ప్రజలకు అర్థమైందని, ఆ రెం డు పార్టీల పై ప్రజానీకానికి విశ్వాసం లేదని, ఎవరు ఆ పార్టీలను నమ్మేస్థితిలో లేరని తెలిపారు. దేశప్రజలంతా బిజెపి నరేంద్ర మోది నాయకత్వంపై నమ్మకం , విశ్వాసంతో ఉన్నారని తెలిపారు.
తెలంగాణలో కూడా ప్రజలం తా బిజెపి వైపు చూస్తున్నారన్నారు. లోగడ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే ఎందు కు నిదర్శనమన్నారు. ప్రజలు బిజెపిపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, జ రగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి సత్తా చాటి చెప్పడానికి పార్టీ శ్రేణులంతా తగి న కృషి చేయలన్నారు. జరగబోయే జడ్పిటిసి, ఎంపిటిసి, సర్పంచ్ ఎన్నికల సమరం లో కాషాయ జెండా రెపరెపలాడించడానికి తగిన కార్యచరణతో ముందు కొనసాగాలని తెలిపారు.
అనంతరం ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడారు. ఈ సమావేశంలో రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, చీఫ్ స్పోక్స్ పర్సన్ ఎన్ వి సుభాష్, బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బుడిగే శోభ, తాజా మాజీ మేయర్ సునీల్ రావు, మాజీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ రావు, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కరీంనగర్ , రాజన్న సిరిసిల్ల జిల్లా పదాధికారులు , ముఖ్య నేతలుపాల్గొన్నారు.