calender_icon.png 23 July, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరంగల్ కలెక్టర్ కార్యాలయం ముందు ఎంసిపిఐయు నాయకుల ధర్నా

22-07-2025 09:33:09 PM

వరంగల్ (విజయక్రాంతి): వరంగల్ నగరంలో మంగళవారం ఎంసిపిఐయు పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకొని నివాసం ఉంటున్న పలు కాలనీ వాసులకు మౌలిక వసతులు కల్పించి, పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర కార్యదర్శి జి. రవి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జక్కులుద్దీన్, రాజీవ్ గృహకల్ప, గీసుకొండ, బెస్తం చెరువు గుడిసె వాసులకు కరెంటు, తాగునీరు, మురికి కాలువల నిర్మాణం, సీసీ రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు.

గత 20 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న లెనిన్ నగర్, నాన్మీ తోట, నర్సంపేట, ఆర్ఎస్ నగర్, ఎన్ హెచ్ నగర్, సుందరయ్య నగర్ తదితర కాలనీలకు పట్టాలిచ్చి, ఇందిరమ్మ ఇండ్లను నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సుబేదారి పోలీసులు భద్రతా చర్యలు చేపట్టి ప్రధాన గేటుకు తాళం వేయించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెద్దారపు రమేష్, కుమారస్వామి, జగదీశ్వర్, ప్రతాప్, సాగర్,  రామస్వామి ల తో పాటు కార్యకర్తలు, మహిళలు, గుడిసె వాసులు పాల్గొని కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు.