calender_icon.png 19 August, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హోదాలో నేను.. పనిలో నువ్వు

19-08-2025 12:00:00 AM

- పేరుకే ఏడీ... పని చేసేదంతా రిటైర్డ్ ఉద్యోగి 

- కాసులు ఇస్తేనే సర్వే పనులు.!

- భూ వివాదాల సర్వేకు రిటైర్డ్ ఉద్యోగి భరోసా 

- నీకెంత.. నాకెంత అతను చెప్పింది ఫైనల్..!

- సర్వే ఎవరి చేత చేపిస్తే  ఏముంటుంది :  రామానుజం గిరిధర్, సర్వే  ఏడీ, నారాయణ పేట జిల్లా 

నారాయణ పేట ఆగస్టు 18 (విజయ క్రాంతి) : హోదా లో నేను ఉన్నాను... పని లో నువ్వు ఉండు.. వచ్చిందంట్లో చూసుకుని పంచుకుందాం.. మనల్ని అడిగేది ఎవరు... సర్వే చేస్తేనే.. ఏదో కొంత వస్తాయి.. అన్ని ప నులు నేను చేయలేను.. అంటూ జిల్లా అధికారి అంతర్లేనంగా ఒప్పందం చేసుకుంటూ ఓ రిటైర్డ్ అధికారిని ప్రోత్సహిస్తూ మూడు పువ్వులు ఆరు కాయలుగా తమ తమ విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.

స ర్వే ఎవరి చేత చేపిస్తే ఏముంటుంది.. సంబంధిత అధికారి నివారణ కోరినప్పటికీ నిర్లక్ష్యం గా సమాధానం చెబుతూ విధులు నిర్వహించాల్సినఆయన పక్కన పెట్టి పక్కవారితో చే పిస్తూ కాలం వెల్లదీస్తున్నారు. నియంత్రించాల్సిన అధికారికి ఈ విషయం తెలియక పోవడంతో నిజంగానే సర్వే ఏడి సర్వే చేసి ఇచ్చారనుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో ద ర్యాప్తు చేసి నిబంధనలను పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

- ఇక్కడ నిబంధనలు ఇలానే ఉన్నాయా..?

 నారాయణపేట జిల్లాలో ఏదైనా భూవివాదం చోటు చేసుకున్నట్లు అయితే రైతులు, (పట్టదారులు) సర్వే చేపట్టడానికి మొదట మండల సర్వేయర్ పరిధిలో నిర్వహించిన తరువాత ఆ తర్వాత డివిజనల్ సర్వేయర్ స్థాయిలో సర్వే ..ఏడి సర్వేకు దరఖాస్తు చేసుకునే క్రమంలో జిల్లా భూసర్వే అధికారి చేప ట్టాల్సి ఉంటుంది. కాగా ఈ నిబంధనలు ఇక్కడ మాత్రం వర్తించవు... ఏడి సర్వే అం టే... ఏడికి తెలిసిన వ్యక్తి వచ్చి వెళ్తాడు... సర్వే రిపోర్ట్ మాత్రం ఏడి ఇస్తారు... ఎక్కడ హ ద్దులు ఉన్నాయి ఎక్కడ ఏమేమి ఉన్నాయ్ అనే విషయాలు పూర్తిస్థాయిలో ఏది అందుబాటులో ఏర్పాటు చేసుకున్న రిటైర్డ్ డి ఐ సర్వే చేస్తారు.

నారాయణపేటలో విధులు గి ట్లనే ఉంటాయి మరి.. అడిగే వారెవరు అడ్డు వచ్చేది ఎవరు అనే విధంగా సర్వే ఏడి తన ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తూ ప్రజలను ఇబ్బందులు గురిచేస్తున్నారు. వివరా ల్లోకెళ్తే ఇలా ఉన్నాయి..ఇక్కడే జిల్లా భూసర్వే అధికారిగా రామానుజం గిరిధర్ బాధ్యతలు తీసుకొన్న తర్వాత ఆయనకు సర్వే చేపట్టడంలో అవగాహన ఉందో లేదో ఆయన మాత్రం పదవీవిరమణ చేసిన డి ఐ ద్వారా సర్వే పనులు చేయిస్తుండటం చర్చనీయాం శం గా మారిందనటానికి నిదర్శనం. మరి జి ల్లా భూసర్వే అధికారి మాత్రం ఆయనకు స హాయకులు గా వ్యవహరించడానికి సర్వేకు దరఖాస్తు చేసుకొన్న వారినుండి ఇరువర్గా లు నుండి కాసులు తీసుకొని సర్వే పనులు చేస్తున్నారనీ ఆరోపణలు ఉన్నాయి.

ప్రతి ద రఖాస్తు దారునుండి ఎకరాకు ఎంతో కొంత మామూళ్ళు ముట్టచెప్పందే సర్వేకు వెళ్ళడనీ చర్చించు కొంటున్నారు. దీంట్లో భాగంగానే ఓ భూమికి సంబంధించి 3తులాల బం గారు తీసుకొని సర్వే పనులు నిర్వహించినట్లు సమాచారం.అలాగే ఆయనకు బదులు రిటైర్డ్ సర్వేయర్ వేదగిరి కి డబ్బులు ఇచ్చి భూ సర్వే పనులు చేస్తున్నారనీ రైతులు వా పోతున్నారు. ఇకనుండి అయినా జిల్లా కలెక్టర్ స్పందించి ఏడి కి బదులు పదవీవిర మ ణ చేసిన వేదగిరి తో సర్వే పనులు చేయ టంపై జిల్లా భూ సర్వే అధికారిపై చర్యలు తీ సుకోవాలని పలువురు కోరుతున్నారు. స్నే హితులు అయినంత మాత్రాన అధికార దు ర్విని వాళ్లకు పాల్పడుతూ ముందుకు సాగ డం వెనుక ఉన్న అంతర్యం ఏమిటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

-మేమిద్దరం ఫ్రెండ్స్.... సహాయం చేస్తే తప్పా 

నేను సర్వే ఏడి గిరిధర్ ఇద్దరం మి త్రులం.. నాకు తెలిసిన సహాయం చేస్తున్నాను.. మిత్రులము అయినందున స హాయం చేస్తే తప్పు ఎలా అవుతుంది. సర్వే చేసే వారికి వేగంగా చేస్తూ అందరి కీ అందుబాటులో ఉంటూ వస్తున్నాం.. నా మిత్రునికి నేను సహకరిస్తున్నాను..

  వేదగిరి, రిటైర్డ్ ఉద్యోగి,

- ఎవరితోనైనా సర్వే చేస్తా నా ఇష్టం..

ఇదే విషయంపై ఏడి రామానుజం గిరిధర్ ను వివరణ కోరగా నా ఇష్టమైన వ్యక్తులతో సర్వే పనులు చేస్తాను. ఎవరు సర్వే చేస్తే ఏముంది.. ఇవ్వాల్సిన రిపోర్టు ఇస్తాం.. అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. 

       రామానుజం గిరిధర్, సర్వే ఏడి, నారాయణ పేట జిల్లా