19-08-2025 12:00:00 AM
- చెరువు కట్టల పటిష్టతకు ప్రత్యేక సర్వే చేయండి
- నియోజకవర్గంలో 20 ఏళ్లకు ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు చేయండి
- అధికారులతో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
జడ్చర్ల ఆగష్టు 18 : మీరు పనులు చేస్తూ ఉండండి మీకు అవసరమైన నిధులు నేను తీసుకువస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అధికారులకు భరోసానిచ్చారు. సోమవారం జడ్చర్ల లో ని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వివిధ శాఖల అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. వి ద్యుత్ ప్రమాదాలు ఎక్కడ జరగకుండా చూడాలని, చెరువు కట్టల పటిష్టతకు ప్రత్యేక చర్యలు తీ సుకోవాలని ఆదేశించారు. మరో 20 ఏళ్లు జడ్చర్ల నియోజకవర్గం లో రోడ్లపైకి నీరు రాకుండా పక్కగా ప్రణాళికలు వేసి పనులు చేయాలని ఆదేశించారు.
నిర్లక్ష్మ అనే మాటకు తావు లేకుండా భవిష్యత్తు బాగుండాలని సంకల్పంతో అడుగులు వేయాలని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చూడటం కోసం రూ.11 కోట్లతో సేఫ్టీ బడ్జెట్ ను ప్రభుత్వాని కి పంపామని, ఆ నిధులు త్వరగా వచ్చేలా చూడాలని అధికారులు కోరగా, ఈ విషయం గురించి తక్షణ చర్యలు తీసుకోవాలని అనిరుధ్ రెడ్డి విద్యుత్ శాఖ సీఎండీని ఫోన్ లో కోరగా ఆయన సా నుకూలంగా స్పందించారని తెలిపారు.
మీరు పదవి విరమణ పొందిన మీరు చేసిన పనులు పదిలంగా ఉండేలా పక్కాగా చేయాలని ఆదేశించారు. ప్రజల మన్ననలు అధికారులపై ఎల్లప్పు డూ ఉంటాయని, ప్రజల విశ్వాసాన్ని మరింత రెట్టింపు చేస్తూ పనులు చేయాలని స్పష్టం చేశారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా అందరం కలిసి పని చేద్దామని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు ఉన్నారు.