28-10-2024 05:54:11 PM
మందమర్రి (విజయక్రాంతి): రహదారి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టనున్నట్లు పట్టణ సీఐ శశిధర్ రెడ్డి తెలిపారు. సోమవారం సర్కిల్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగిన ప్రాంతాలను నేషనల్ హైవే అధికారులతో కలిసి పరిశీలించారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. వాహనదారులు రహదారి భద్రతా చర్యలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్సై రాజశేఖర్ నేషనల్ హైవే అధికారులు పాల్గొన్నారు.