calender_icon.png 30 January, 2026 | 6:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు భూతగాదాలు లేని మెదక్ జిల్లాగా తీర్చిదిద్దాలి

30-01-2026 12:16:09 AM

పక్కగా భూమి యొక్క నక్ష, మ్యాప్, హద్దుల నిర్ణయం 

భూమి ఆక్రమణలకు తావు లేకుండా భూ భారతి 

భూ రీసర్వే కార్యక్రమం 

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ 

మెదక్, జనవరి 29 (విజయ క్రాంతి): జిల్లాను భూ తగాదాలు లేనీ జిల్లాగా తీర్చిదిద్దాలని, ప్రతి భూ కమతానికి సరైన నక్షను, మ్యాప్ ను, హద్దులను నిర్ణయించి, పటిష్టమైన భూ రికార్డులు నమోదు చేయాలని జి ల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. భూ భారతి చట్టం భూముల రీసర్వే కార్యక్రమం కోసం మెదక్ మండలంలోని పైలెట్ గ్రామపంచాయతీ అయిన పా షాపూర్ లో బుధవారం గ్రామసభ నిర్వహించారు. భూ భారతి చట్టం భూముల రీస ర్వే కోసం నిర్వహించిన గ్రామసభలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్,అదనపు కలెక్టర్ నగే ష్, తహసిల్దార్ లక్ష్మణ్ బాబు లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహు ల్ రాజ్ మాట్లాడుతూ..భూ భారతి చట్టం ద్వారా అన్ని భూ సమస్యల పరిష్కారం అవుతుందని తెలిపారు.

పాషాపూర్ గ్రామంలో భూ భారతి చట్టం భూముల రీసర్వే కార్యక్రమం నిర్వహించుకోవడనికి గ్రామ సభ ఏ ర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. భూ భారతి భూముల రీసర్వే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రైతులకు పక్కగా భూ హద్దులు, భూ మి యొక్క నక్ష, మ్యాప్ లను నిర్ణయించి, పటిష్టమైన భూ రికార్డులను తయారు చేయడమే అని అన్నారు. ప్రతి కమతానికి రీసర్వే చేసి రైతులకు భూ తగాదాలు లేకుండా చూ డడమే దీని ముఖ్య ఉద్దేశం అని అన్నారు. డిజిటల్ సర్వేతో హద్దుల నిర్ణయించి, అక్షాం శ రేఖాంశాలతో సర్వే చేయడం జరుగుతుందన్నారు. ఈ సర్వే తో భూ హద్దులు చెరిగి పోకుండా ఉంటాయని, భూమి ఆక్రమణలకు గురి కాకుండా ఉంటుందన్నారు.

ఈ రీ సర్వే అనంతరం రైతులు భూమిని ఎక్కడకు వెళ్లిన లేదా విదేశాల్లో సైతం తన భూమిని పరిశీలించుకోవచ్చని తెలిపారు. తర్వాత రోజుల్లో ఈ గ్రామాన్ని నమూనాగా తీసుకొ ని జిల్లాలోని మరో 23 గ్రామాల్లో భూ భారతి భుముల రీసర్వే చేసి సమస్యలను శా శ్వతంగా పరిష్కరిస్తామన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. గ్రామం లో ఉన్న భూములాన్ని రీసర్వే చేసి భూమి సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నా రు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ప్రజలు,అధికారులు, తదితరులు పాల్గొన్నారు.