30-01-2026 12:14:09 AM
ఊరూరా అక్రమ నిల్వలు
ఎంఆర్పీ మాయాజాలం.. బేఖాతరవుతున్న బైండోవర్లు
మొక్కుబడి తనిఖీలతో సరిపెడుతున్న అధికారులు
నంగునూరు,జనవరి 29: ఒకప్పుడు పాడిపంటలతో, పచ్చని ప్రకృతితో కళకళలాడిన పల్లెలు నేడు మద్యం మత్తులో విలవి లాడుతున్నాయి. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో నిబంధనలకు విరుద్ధంగా వైన్స్ షాపులు అమ్మకాలను పెంచుకోవడ మే లక్ష్యంగా ఊరూరా బెల్ట్ షాపులను ప్రో త్సహిస్తూ సామాన్యుడి బతుకులను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. మండలంలో మూడు మద్యం షాపుల యజమానులు ఏకమై, గ్రామాల్లోని గల్లీ గల్లీకి మద్యాన్ని సరఫరా చేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వైన్స్ నిర్వాహకుల ఇష్టారాజ్యం...
అధికారిక దుకాణాలకు సమయపాలన ఉన్నా, వైన్స్ యజమానుల అండతో నడుస్తున్న బెల్ట్ షాపులకు మాత్రం ఏ నిబంధ నలూ లేవు. మండల పరిధిలోని బద్దిపడగ, రాంపూర్ క్రాసింగ్, నర్మేట వంటి గ్రామాల్లోని ఇళ్లలో పెద్ద ఎత్తున మద్యం స్టాక్ డంపు లు ఏర్పాటు చేసి మినీ బార్లను తలిపిస్తున్నారు.రాజీవ్ రహదారి ఆనుకొని ఉన్న ఒక ఇంట్లో యథేచ్ఛగా హోల్సేల్,రిటైల్ విక్రయా లు సాగిస్తున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒక్కో బాట్పి ఎంఆర్పీ కంటే రూ.20 నుంచి రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తూ నిరుపేద కూలీల రక్తాన్ని పిండుతున్నారు.
సిపి మారగానే .. సీన్ మారిందా?
గతంలో సిద్దిపేట సీపీగా విజయ్ కుమా ర్ ఉన్న సమయంలో బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపారు. ఎన్నికల ముందు సుమా రు 160 మంది నిర్వాహకులను తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసి, తిరిగి అమ్మకాలు చేస్తే రూ.2 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అయితే సీపీ బదిలీ కావడం, డిసెంబర్లో కొత్త వైన్స్ టెండర్లు రావడంతో పాత నిర్వాహకులు మళ్లీ తమ అడ్డాను సిద్ధం చేసుకుంటున్నారని విమర్శలు వెలువడుతున్నాయి. అంగీకార పత్రాలపై సంతకా లు చేసిన వారే తిరిగి వైన్స్ యజమానులతో చేతులు కలిపి విక్రయాలు సాగిస్తుండటం గమనార్హం.
మొక్కుబడి తనికిలేనా?
ఇటీవల నంగునూరు మండలం బద్దిపడగ,పాలమాకుల గ్రామాల్లో ఎక్సైజ్ అధికా రులు దాడులు చేసి కొంత మద్యం స్వాధీ నం చేసుకున్నప్పటికీ, అవి కేవలం ’మొక్కుబడి’ తనిఖీలుగానే మిగిలిపోతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైన్స్ యజమానులే స్వయంగా గ్రామాలకు వా హనాల్లో మద్యం సరఫరా చేస్తున్నా యం త్రాంగం చోద్యం చూస్తోందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, వైన్స్ నిర్వాహకుల అక్రమాలకు అడ్డుకట్ట వేసి, పల్లెల్లో ‘బెల్ట్’ రక్కసిని శాశ్వతంగా అంతమొందించాలని మండల ప్రజలు ముత్కంటంతో వేడుకుంటున్నారు.