20-01-2026 12:39:55 AM
గంజాయి కేసు, విద్యాసంస్థల బెదిరింపు, ఆస్పత్రుల్లో అక్రమ వసూళ్లు
నగరంలో విలేకరులపై పోలీస్ కేసులు, పలువురి రిమాండ్
మరికొందరు పరారీ
విలేకరుల ఆగడాలు
తీవ్రంగా పరిగణించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ జనవరి19: (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలువురి విలేకరులపై కేసులు నమోదయ్యాయి. కొందరు విలేకరుల బెయిలు లభించగా మరొక కేసులో నిందితులు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న విజయ్ సురే ష్ ల కొరకు పోలీసులు ముమ్ముర ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఏకంగా నిజామా బాద్ సిపి కార్యాలయం పేరిట డబ్బులకు వసూళ్లకు పడటం తీవ్రంగా భావించిన సిపి సాయి చైతన్య నిందితుల అరెస్టుకు ప్రత్యేక పోలీసులను ఏర్పాటు చేశారు.
నిందితులకు తరచూ ఫోన్ సంభాషణలో ఉండి వారికి సహకరిస్తున్నారు అన్న సమాచారం మేరకు ఇద్దరు పోలీసు అధికారులపై సిపి సాయి చైతన్య వెయిట్ వేయనున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మీడియా గాడి తప్పుతోందంటే అవునని సమాధానంవస్తోంది. గత కొద్ది రోజులుగా జర్నలిస్టులపై కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. నిజాంబాద్ నగరంలోని పలువురు విలేకరులు నగరంలోని ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల వాడిలో ఉన్న ఓ ప్రైవేటు దవాఖానాలో చికిత్స పొందుతూ ఈనెల 16వ తేదీన ఓ మహిళ మృతి చెందింది మృతురాలి కుటుంబ సభ్యులు దవఖాన యజమాన్యానికి మధ్య డబ్బుల విషయంలో వాదుపవాదాలు జరిగాయి.
విషయం తెలుసుకున్న విషయం తెలుసుకున్న ఐదుగురు విలేకరులు ఆసుపత్రికి చేరుకొని ఫోటోలు వీడియోలు తీసి ఆసుపత్రి ని అపఖ్యాతి కలిగేలా చేస్తామని బెదిరించడమే కాకుండా తమ వద్ద నుండి బలవంతంగా డబ్బుల వసూళ్లకు పాల్పడ్డారని దవఖాన యజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్షర విజేత విలేఖరి అహ్మద్, పెద్దోళ్ల ప్రమోద్ శ్రీనివాస్ ఎం నవీన్ వంశీ ఈ అయిదుగురిపై కేసు నమోదు చేసినట్టు వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ రాకపోతే తెలిపారు. వీడియోలు ఫోటోలు వైరల్ చేస్తామని బెదిరించి ఆసుపత్రి యజమాన్యం నుండి 10వేల రూపాయలు వసూళ్లకు పాల్పడ్డారని ఆసుపత్రి వర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహమ్మద్ ప్రమోద్ అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
ఇదిలా ఉండగా ఈరోజు మిగతా వారికి కూడా పదివేల పూచికత్తు తో కూడిన భైలు మంజూర అయింది. ఇదిలా ఉండగా మరో గంజాయి కేసులో నిందితుడికి అండగా ఉన్నారన్న ఆరోపణపై బతుక మ్మ లోకల్ ఎడిషన్ బాధ్యుడైన రామకృష్ణతోపాటు మరో విలేఖరి సల్మాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో రామకృష్ణకు పూచికత్తుపై బెయిల్ మంజూరు కాగా సల్మాన్ రిమాండ్ విధించారు నగరంలోని ఐటిఐ ప్రాంతంలో షేక్ అప్రోచ్ అలియాస్ రోడ్డ అప్రోజ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అతని వద్దనుండి 210 గ్రాముల గంజాయి లభించడంతోపాటు విశ్వానియ సమా చారం రాబట్టిన పోలీసులురొడ్డా అఫ్రోజ్ ఇచ్చిన సమాచారం మేరకు రామకృష్ణ సల్మాన్ లను గత శనివారం తెల్లవారుజామున వారి ఇళ్లలో నుండి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉండగా మరో కేసులో గత 12వ తేదీ మధ్యాహ్నం రీ రేయాన్ష్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నిర్వాకుడు వ్యవస్థాపకుడు మహేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్షర టుడే పత్రిక బాధ్యుడు హీరో హెడ్ విజయ్, ఆంధ్రజ్యోతి పత్రిక విలేఖరి అంజి, అక్షర టుడే ఫోటోగ్రాఫర్ సురేష్, టీవీ9 విలేఖరి దివాకర్, తోపాటు గోపాల్ మొగిలి, రవీందర్ గౌడ్, రాజు గౌడ్, కొత్తపల్లి అజయ్ లపై గత 12వ తేదీన ఎఫ్‌ఐఆర్ నమోదయింది.
12/01/2026/, ఎఫ్ ఐ ఆర్ 15/2026, సెక్షన్ 308(2), 308, (3), r/w61(2) బిఎన్‌ఎస్ కేసు నమోదు అయ్యింది. రేయాన్ష్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో అనుమతికి మించి అడ్మిషన్లు తీసుకున్నారని అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని రియాన్ష్ ఇన్స్టిట్యూట్ కి వచ్చిన అక్షర టుడే కెమెరామెన్ సురేష్ ఫోటోలు వీడియోలు తీయడంతో ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు మహేందర్ ఫోటోలు ఎందుకు తీస్తున్నావ్ అని ప్రశ్నించగా అక్షర టుడే బ్యూరో హెడ్ విజయ్ సెల్ నెంబర్ 9 0 1 0 6 1 4 4 4 4 నెంబర్ ఇచ్చి ఫోన్ లో మాట్లాడమని చెప్పాడని మహేందర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుల పేర్కొన్నాడు సురేష్ ఇచ్చిన నెంబర్ ప్రకారం విజయం సంప్రదించగా ఇక విద్యార్థులే కాకుండా మాస్ కాపీయింగ్ పాల్పడుతున్నారని ఈ విషయమై వార్తలు ప్రచురిస్తే సంస్థ లైసెన్స్ రద్దు అవుతుందని బెదిరించి పది లక్షల రూపాయలు డిమాండ్ చేశారని విజయకి 50, వేల రూపాయలు ఇవ్వగా అందుకు నిరాకరించి ఐదు లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడని ఈ ఐదు లక్షల రూపాయలలో నిజామాబాద్ జిల్లా పోలీస్ మిషనర్ కార్యాలయంలోని పలువురు అధికారులను ‘మేనేజ్‘చేయడంతో పాటు ఆంధ్రజ్యోతి అంజి బతుకమ్మ విలేఖరి గోపాల్ కు కూడా ఇవ్వాల్సి ఉంటుందని ఒత్తిడి చేయడంతో. మహేందర్ తన సోదరుడు బంటు కిషోర్ ద్వారా డబ్బును నేరుగా అక్షర విజయ్ సుధా కు అందజేశాడని పోలీసులకు ఇచ్చిన లిఖితపూర్వకమైన ఫిర్యాదులో మహేందర్ పేర్కొన్నాడు. మహేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విలేకరులతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
దర్యాప్తు కొనసాగుతోంది
సాక్షాలు సేకరించే పనిలో ఉన్నాం 4.వ టౌన్ ఎస్ హెచ్ ఓ విలేకరుల పై ఫిర్యాదు అందిన మాట వాస్తవమేకేసు నమోదు చేశాం సాక్ష్యాల కోసం కేసును దర్యాప్తు చేస్తున్నాం. సాక్ష్యాలు సేకరించే పనిలో దర్యాప్తు కొనసాగుతోంది.
- పట్టణ నాలుగో టౌన్ ఎస్ హెచ్ ఓ సతీష్