27-10-2025 12:00:00 AM
రాష్ట్ర కురుమ సంఘం భవనంలో ఏర్పాటు
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 26 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఉన్న కురుమ సామాజిక వర్గానికి చెందిన నిరుపేదలకు హైదరాబాద్‌లోని రాష్ట్ర కురుమ సంఘం భవనంలో మెడికల్ అడ్వైజ్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ అడ్వైజ్ ఇన్ఫర్మేషన్ కేంద్రాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగపరుచుకోవాలని రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం కురుమ పేర్కొన్నారు.
ఈ మేరకు ముస్లిం జంగ్ ఫుల్ వంతెన వద్ద ఉన్న తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం భవనంలో డాక్టర్ మిరియాల అశోక్ కుమార్, డాక్టర్ ఎగ స్వప్న, కొరిడే, సుదర్శన్ రావు, ఒగ్గు కుమారస్వామి, మా ఊరి రాజేందర్ లా, కమిటీ బృందం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెడికల్ అడ్వైస్ ఇన్ఫర్మేషన్ కేంద్రాన్ని ఎగ్గే మల్లేశం, వర్కింగ్ ప్రెసిడెంట్ క్యామ మల్లేశం, ప్రధాన కార్యదర్శి బండారు నారాయణ, కె శ్రీనివాస్, కొలుపుల నరసింహ, కట్ట మల్లేశంలతో కలిసి ప్రారంభించారు.
ఎగ్గె మల్లేశం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న కురుమలకు అతి తక్కువ ఖర్చుతో సంపూర్ణ ఆరోగ్యం అందించాలనే ఉద్దేశంతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ సెంటర్ ద్వారా రాష్ట్రంలో ఉన్న కురుమ సామాజిక వర్గానికి చెందిన 300 మంది వైద్యులు, ఇక్కడికి వచ్చే పేద కురుమలకు సలహాలు సూచనలు అందిస్తారని తెలిపారు. అవసరమైన వారికి ఉచితంగా మం దులు అందించడంతోపాటు, ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భవ వంటి పథకాల్లో పేర్లను నమోదు చేయిస్తారని పేర్కొన్నారు. ఈ కేంద్రం 365 రోజుల పాటు పనిచేస్తుందన్నా రు.
ఈ కేంద్ర ముఖ్య ఉద్దేశము.. రోజురోజుకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం పేరుతో పేద ప్రజల రక్తం తాగుతున్నారని, వారి ఆగడాల నుండి అరికట్టేందుకు ఈ కేంద్రం ఎంతో చక్కగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో చిగుమల రాఘవేంద్ర, కే స్వామి, చిట్టెం శైలేందర్, శ్యామ్‌రావు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు తమకొండ బాలమని, నగర అధ్యక్షురాలు మిరియాల విజయ, వీరాపురం శ్యామల, కే సునీత, టి మాధవి, ఎస్ జగదాంబ, ఏం కళావతి, ఏం విజయ, శ్యామల పాల్గొన్నారు.